రాజకీయ పార్టీని స్థాపించిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత

Submitted by arun on Fri, 08/24/2018 - 12:46

ఎన్నికల వేళ ఏపీలో మరో రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది.  జనజాగృతి పేరుతో అరకు ఎంపీ కొత్తపల్లి గీత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అందరికి విద్య, వైద్యం, ఆరోగ్యం, తాగు సాగు నీరు, గృహ వసతి కల్పించడమే లక్ష్యమంటూ ప్రకటించారు. కర్షక, కార్మిక, మహిళా సాధికారికతలకు పెద్దపీట వేసేలా పార్టీ జెండా రూపొందించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన కొత్తపల్లి గీత ...  ఎన్నికల అనంతరం టీడీపీకి ఫిరాయించారు.  అయితే టీడీపీలోనూ విభేదాలు రావడంతో  బయటకొచ్చిన  తాజాగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.  ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.  

English Title
Jana Jagruthi Party Launch

MORE FROM AUTHOR

RELATED ARTICLES