తిరుపతి కిరీటాల చోరీ కేసు నిందితుడు అరెస్ట్..

తిరుపతి కిరీటాల చోరీ కేసు నిందితుడు అరెస్ట్..
x
Highlights

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కిరీటాలు అపహరించిన దొంగను మహారాష్ట్రకు చెందిన ఆకాశ్‌గా పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ...

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కిరీటాలు అపహరించిన దొంగను మహారాష్ట్రకు చెందిన ఆకాశ్‌గా పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఆధారంగా మొదట నిందితుడి ఫొటో లభ్యమైంది. దోపిడికి గురైన కిరీటాలను కరిగించిన నిందితుల నుంచి 1350 గ్రాములు బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.42 లక్షల 35 వేలని చెప్పారు. ఈ కేసు కోసం 80 రోజులు, 40 మంది పోలీసులు శ్రమించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించామని, నిందితుడు దొంగతనం చేశాక రేణిగుంట, కాచిగూడల్లో స్థానికంగా ఉన్న బంగారు వ్యాపారుల వద్ద అమ్మటానికి ప్రయత్నించి విఫలమయ్యాడని తెలిపారు. అయితే గుడిలో ఉన్న సీసీ కెమెరా, ఓ వైన్‌షాప్‌ వద్ద ఉన్న సీసీ కెమెరా అనంతరం రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాలో నిందితుడు కనపడ్డానని తెలిపారు. అయితే నిందితుడి కదలికల ఆధారంగానే వివిధ ప్రాంతాలకు తమ పోలీసు టీంలను పంపించినట్లు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories