హీరో గా మారనున్న రాక్ స్టార్

హీరో గా మారనున్న రాక్ స్టార్
x
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ సంగీతదర్శకులలో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒకరు. అప్పుడప్పుడు స్టార్ హీరోలతో కొన్ని పాటల్లో తెరపై కూడా కనిపించిన దేవిశ్రీ...

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ సంగీతదర్శకులలో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒకరు. అప్పుడప్పుడు స్టార్ హీరోలతో కొన్ని పాటల్లో తెరపై కూడా కనిపించిన దేవిశ్రీ త్వరలో హీరోగా రాబోతున్నాడు అనే వార్త ఒకప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఆ తర్వాత దీని గురించి ఒక అప్డేట్ కూడా బయటికి రాలేదు. తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ ను హీరో గా మార్చడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి సుకుమార్ దేవిశ్రీ ని ఎప్పుడో హీరోగా లాంచ్ చేయాల్సి ఉంది కానీ ఆ ప్రాజెక్ట్ చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చింది.

అయితే తాజాగా సుకుమార్ ఈ సినిమాను మళ్ళీ పట్టాలెక్కించబోతున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. అంటే త్వరలో దేవిశ్రీప్రసాద్ హీరోగా మారనున్నారన్నమాట. సుకుమార్ అసిస్టెంట్ దర్శకులలో ఒకరు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుకుమార్ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories