బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించిన జైట్లీ

Submitted by arun on Thu, 02/01/2018 - 11:18
arunjaitly

ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో 2018-19 బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్‌ ప్రసంగానికి ఉద్యుక్తులయ్యారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ ప్రారంభం కాగానే సభ్యులందరూ ఎంపీ చింతామణి మంగ మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం స్పీకర్‌ అనుమతితో జైట్లీ సభలో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. ఎప్పుడూ ఆంగ్లంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రి తొలిసారి హిందీలో బడ్జెట్‌ విషయాలను ప్రసంగిస్తుండటం విశేషం. వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చాక ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ ఇది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English Title
jaitly budget speech begin loksabha

MORE FROM AUTHOR

RELATED ARTICLES