100 కోట్ల ఆస్తిని, కన్న కూతుర్ని విడిచిపెట్టి సన్యాసం!

100 కోట్ల ఆస్తిని, కన్న కూతుర్ని విడిచిపెట్టి సన్యాసం!
x
Highlights

సూరత్: ఆ భార్యాభర్తలిద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘ జీవనంపై చిరాకు కలిగిందో, సంపదపై వ్యామోహం చచ్చిపోయిందో కానీ వంద కోట్ల ఆస్తిని, కన్న...

సూరత్: ఆ భార్యాభర్తలిద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘ జీవనంపై చిరాకు కలిగిందో, సంపదపై వ్యామోహం చచ్చిపోయిందో కానీ వంద కోట్ల ఆస్తిని, కన్న కూతుర్ని వదులుకుని వారిద్దరూ సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. అయితే వారు తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఆ దంపతులకు మూడేళ్ల పాప ఉంది. ఆ చిన్నారిని త్యజించి వారు సన్యాసుల్లో కలిసిపోవాలని భావించడంపై విమర్శలొస్తున్నాయి. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా ఆమె భర్త ఇప్పటికే సన్యాసం స్వీకరించాడు. ఇవాళ భార్య కూడా అదే బాటలో నడిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ జైన జంట సన్యాసం స్వీకరించడం బంధువులతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయం తీసుకున్న భార్యాభర్తలు సుమిత్ రాథోర్, అనామిక కుటుంబాల పెద్దలు తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత వారిద్దరూ తమ నిర్ణయం మారదని స్పష్టం చేయడంతో పెద్దలు కూడా చేసేదేమీ లేక ఒప్పుకున్నారు.

ఇదిలా ఉంటే, కొందరు సామాజిక కార్యకర్తలు చిన్నారిని వదిలి వెళ్లడాన్ని తప్పుబడుతూ జాతీయ మానవ హక్కుల కమీషన్‌కు ఈ దంపతులపై ఫిర్యాదు చేశారు. దీంతో శనివారమే ఆమె భర్తతో పాటు సన్యాసం స్వీకరించాల్సి ఉన్నప్పటికీ అనామిక వాయిదా వేసుకుంది. తన భర్తకు సన్యాసం చేయించిన గురువు సమక్షంలోనే అనామిక కూడా సోమవారం సన్యాసం స్వీకరించింది. ఈ సందర్భంగా వారిపై వచ్చిన ఆరోపణలను అనామిక ఖండించింది. తాము వదిలివెళ్లినందువల్ల తమ కూతురు ఇబ్యా అనాథగా మారదని ఆమె చెప్పింది. తమ కూతురిని తన తమ్ముడు దత్తత తీసుకున్నాడని, ఇప్పటికే ప్రక్రియ కూడా పూర్తయిందని దత్తతకు సంబంధించిన పత్రాలను ఆమె బయటపెట్టింది. కొందరు తమపై తప్పుడు ఫిర్యాదు చేసి నీచానికి పాల్పడుతున్నారని ఆమె వాపోయింది. అయినా తమ కుటుంబం, తన భర్త కుటుంబం ధనికమైనవేనని, ఇబ్యా బాగుంటుందని అనామిక చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories