‘జైసింహా’ రివ్యూ

‘జైసింహా’ రివ్యూ
x
Highlights

‘జైసింహా’తో సంక్రాతి బ‌రిలోకి దిగిన బాల‌కృష్ణ సినిమా ఫ‌స్టాఫ్ లో అభిమానుల్ని క‌నువిందు చేసిన‌ట్లు తెలుస్తోంది. బాల‌కృష్ణ హీరోగా కేఎస్ ర‌వికుమార్...

‘జైసింహా’తో సంక్రాతి బ‌రిలోకి దిగిన బాల‌కృష్ణ సినిమా ఫ‌స్టాఫ్ లో అభిమానుల్ని క‌నువిందు చేసిన‌ట్లు తెలుస్తోంది. బాల‌కృష్ణ హీరోగా కేఎస్ ర‌వికుమార్ డైర‌క్ష‌న్ లో జైసింహా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. మ‌రి ఈ చిత్రం ఫ‌స్టాఫ్ లో అభిమానుల్ని ఏమేర‌కు అల‌రిస్తుంద‌నే విష‌యాన్ని తెలుసుకుందాం.
ఫస్టాఫ్
విశాఖ‌ప‌ట్నంలో ఉండే న‌ర‌సింహా (బాలకృష్ణ) గౌరి(నయనతార)కి తెలియకుండా ఆమె కొడుకుని తీసుకుని అక్క‌డి నుంచి దేవాల‌యాల‌కు ప్ర‌సిద్ధి చెందిన కుంభకోణం అనే ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ఓ దేవాల‌యం ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌గా ఉన్న (మురళీమోహన్‌) ఇంట్లో డ్రైవర్ గా స్థిర‌ప‌డ‌తాడు. అదే స‌మ‌యంలో ఆలయ ధర్మకర్త కుమార్తె ధాన్య(నటాషా దోషి) యాక్సిడెంట్ నేరాన్ని త‌న‌పై వేసుకోవ‌డం. ఏసీపీని ఎదిరించ‌డంతో అత‌నితో శత్రుత్వం పెంచుకోవడం, విశాఖ‌లో ఉన్న గౌరి త‌న కొడుకుకోసం కుంభ‌కోణం చేరుకోవ‌డంతో న‌ర‌సింహా కు విప‌త్క‌ర పరిస్థితులు ఎదుర‌వుతాయి. మ‌రి ఈ ప‌రిస్థితుల‌నుంచి న‌ర‌సింహా ఎలా త‌ప్పించుకున్నాడు. న‌ర‌సింహా,బాల‌కృష్ణ మ‌ధ్య సంబంధం ఏంటో ఫ‌స్టాఫ్ లో తెలిసిపోతుంది. ఇక డైర‌క్ట‌ర్ సెకెండాఫ్ పైనే ఆశ‌లు పెట్టుకున్నాడు. ఫ‌స్టాఫ్ లో కుంభ‌కోణం ప్రాంతంపై ఫోక‌స్ చేస్తే సెకెండ్ ఆఫ్ విప‌రీత‌మైన సెంటిమొంట్ తో ప్రేక్ష‌కుల్ని మెప్పించే ప్ర‌య‌త్నం చేసి డైర‌క్ట‌ర్ సెక్సెస్ అయ్యాడు. కానీ సెంటిమెంట్ పాళ్లు తగ్గించి వినోదం పాళ్లు పెంచి ఉంటే సింహా రికార్డ్ ల‌ను క్రాస్ చేసేద‌ని ప్రేక్ష‌కులు చెబుతున్నారు. బాలకృష్ణ గ‌త చిత్రాల తాలూకు ఛాయ‌లు జైసింహాలో క‌నిపిస్తాయి. ‘నరసింహనాయుడు’, ‘సమర సింహారెడ్డి’ సినిమా ఫ‌స్టాఫ్ ఎంత కూల్ గా ఉంటుందో..సెకెండ్ ఆఫ్ లో విశ్వ‌రూపం చూపిస్తూ ముగిస్తాడు. సేమ్ ఇలాగే ఉందే జై సింహాలో బాల‌కృష్ణ క్యార‌క్ట‌రైజేష‌న్. ఓవ‌రాల్ గా సినిమా బాగున్నా కొంచెం సెంటిమెంట్ త‌గ్గించి ఉంటే బాగుండేది.
ఎవ‌రెలా చేశారంటే
బాలకృష్ణ గురించి ప్ర‌త్యేకం గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌ట‌న‌, డ్యాన్స్ లో ఆక‌ట్టుకున్నాడు. పాట‌ల్లో అమ్మ‌కుట్టి. బ్రాహ్మ‌ణుల గురించి చెప్పే డైలాగులు, బ్ర‌హ్మానందంతో కామెడీ, ప్ర‌కాష్ రాజ్ తో సెంటిమెంట్ బాగుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు ఎందుకు హీరోయిన్ల‌ను తీసుకున్నారో అర్ధంగాకున్నా వారిలో న‌య‌న‌తార‌దే లీడ్ రోల్ .న‌య‌న ప‌ద్ద‌తిగా, నటాషా దోషి గ్లామర్‌ ఒలికిస్తే, అల్ల‌రి పాత్ర‌లో హరిప్రియ అల‌రించింది. దర్శకుడు కేఎస్ ర‌వికుమార్ పాత క‌థ‌నే ఎంచుకొని చిన్న‌బాబు పాత్ర‌ను యాడ్ చేశాడు. కాబ‌ట్టే సినిమా బాగుంద‌ని అభిమానులు అంటున్నారు. చివరిగా బాల‌కృష్ణ అభిమానుల్ని క‌నివిందు చేస్తూ ..ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు ‘జైసింహా’ సెంటిమెంట్‌ సింహంగా మిగిలిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories