అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్‌కి ఎన్టీఆర్ సినిమా

Submitted by arun on Sat, 07/21/2018 - 17:37
ntr

కథానాయకుడు ఎన్టీఆర్‌ నటించిన ‘జై లవకుశ’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. నార్త్ కొరియాలో జ‌రిగే బిఐఎఫ్ఎఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌, బుచియాన్ ఇంటర్నేష‌న‌ల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో రెండు రోజుల ప్రదర్శనకి గాను 'జై లవ కుశ' సినిమాను ఎంపిక చేశారు. ఉత్త‌మ ఏషియ‌న్ సినిమా విభాగంలో జై ల‌వ‌కుశ చిత్రానికి గౌర‌వం ద‌క్క‌గా, ఈ చిత్రోత్సవంలో చోటు లభించిన ఏకైక తెలుగు సినిమా 'జై లవ కుశ' కావడం విశేషం. జై ల‌వ‌కుశ చిత్రంలో ఎన్టీఆర్ న‌ట‌న‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. 125 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కించగా, క‌ళ్యాణ్ రామ్ నిర్మించాడు. నివేదా థామ‌స్‌, రాశీ ఖ‌న్నాలు క‌థానాయిక‌లుగా న‌టించారు.

English Title
Jai Lava Kusa selected for prestigious film festival

MORE FROM AUTHOR

RELATED ARTICLES