టీఆర్ఎస్‌లో చేరికపై జగ్గారెడ్డి స్పందన

టీఆర్ఎస్‌లో చేరికపై జగ్గారెడ్డి స్పందన
x
Highlights

తాజాగా కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో కారు గూటికి చేరనున్నట్లు పలువురు పుకార్లు గుప్పించారు. అయితే దినిపై...

తాజాగా కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో కారు గూటికి చేరనున్నట్లు పలువురు పుకార్లు గుప్పించారు. అయితే దినిపై జగ్గరెడ్డి స్పందిస్తూ తనపై వచ్చిన వార్తాలను కొట్టిపరేసారు. తాను ఎట్టిపరిస్థిల్లో కాంగ్రెస్ పార్టీని వీడే సమస్యే లేదని జగ్గరెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇటివల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ మారుతారని తాను భావించడంలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఏ ఒక్కరిదో బాధ్యత కాదని అన్నారు. ఎన్నికల్లో రాజకీయ విమర్శలకు ఇచ్చినంత ప్రముఖ్యత తమ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇవ్వలేదని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సమీక్షించి, పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని జగ్గారెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories