జగన్ సంచలన ప్రకటన

Submitted by arun on Thu, 05/31/2018 - 11:45
jagan

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర లో జగన్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడికి 10 వేల చొప్పున పింఛన్లు ఇస్తామంటూ హామీలు గుప్పించారు. అంతేకాదు ఉచితంగా ఆపరేషన్ చేయించడమేకాకుండా, ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్న సమయంలో పేషెంట్‌కి ఉచితంగా డబ్బులు ఇస్తామని తెలిపారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బుధవారం వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించిన జగన్, వైద్యానికి పెద్ద పీఠ వేస్తామని చెప్పిన ఆయన, వైద్య ఖర్చులు 1000 రూపాయలు ధాటితే దాన్ని ‘ఆరోగ్యశ్రీ’ పథకం పరిధిలోకి తీసుకొస్తామన్నారు.
 

English Title
jagan promises to poor people 10 thousandpension

MORE FROM AUTHOR

RELATED ARTICLES