రేపటి జగన్ యాత్ర షెడ్యూల్ ఇదే..!

Submitted by admin on Tue, 12/12/2017 - 11:39

ప్రజాసంకల్పయాత్ర పేరుతో  వైసీపీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే 33వ రోజు అనగా రేపు రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్‌ మండలం చిన్నంపల్లి క్రాస్‌ రోడ్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కూరుకుంట బీసీ కాలనీ, సజ్జల కాల్వ క్రాస్‌ రోడ్డు మీదుగా కూరుకుంట ఎస్సీ కాలనీకి చేరుకుని అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.

అనంతరం వైఎస్సార్‌ కాలనీ, అక్కంపల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. 12 గంటలకు లంచ్‌ బ్రేక్‌ తీసుకుంటారు. అనంతరం 3 గంటలకు తిరిగి పాదయాత్ర చేపడతారు. నందమూరి నగర్‌ మీదుగా పాదయాత్ర కొనసాగి సాయంత్రం 4 గంటల సమయంలో పాపంపేట వద్ద బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడతారని రాష్ట్ర పాదయాత్ర కోఆర్డినేటర్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు..

English Title
jagan-paadhayatra-tomarrow-schedule

MORE FROM AUTHOR

RELATED ARTICLES