కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆశలు గల్లంతు అయినట్టేనా...!

కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆశలు గల్లంతు అయినట్టేనా...!
x
Highlights

బీజేపికి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ ని నమ్మడానికి ఇప్పుడు ఎవరు ముందుకు రావడం లేదు . కాబట్టి ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే...

బీజేపికి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ ని నమ్మడానికి ఇప్పుడు ఎవరు ముందుకు రావడం లేదు . కాబట్టి ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ లేదు . ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర.. ఢిల్లీల్లో చక్రం తిప్పాలంటే తెలాంగాణ నుండి 16 ఎంపీ స్థానాలు మనమే గెలువాలి . ఇది గత కొద్దిరోజులుగా కేసీఆర్ మాట్లాడిన మాటలు ..

ఇప్పడు ఎన్నికలు అయిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి . బీజేపికి సంపూర్ణ మెజారిటీ వచ్చేస్తుందని తిరిగి మోదినే రెండోసారి ప్రధానమంత్రి అవుతారని తెల్చేసాయి .. దీనితో తెలాంగాణ సీఎం కేసీఆర్ పెడరల్ ఫ్రంట్ కలలు కలగానే మిగిలినట్టేనా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి .. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అదే ఉపుతో లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇదే జోరుని కనబరచాలి అని అనుకుంది .

కానీ ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ 14 నుంచి 16 సీట్లు దక్కుతాయని సర్వే ఫలితాలను బట్టి అంచనా వేస్తున్నట్లు సర్వేలు స్పష్టం చేశాయి. గత ఎన్నికల్లో 11 సీట్లు గెలుచుకున్న కేంద్రంలో ఏమీ చేయలేకపోయిన కేసీఆర్ ఈ సారి అంతే సంఖ్యలో సీట్లు వచ్చినా కేంద్రంలో చక్రం తిప్పొచ్చని అంచనా వేశారు. కానీ ఇప్పుడేమైంది..? ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపికి పట్టం కట్టేసాయి . దీనితో అయన ఫెడరల్ ఫ్రంట్ ఆశలు గల్లంతు అయినట్టే అన్న వార్తలు వినిపిస్తున్నాయి ..

Show Full Article
Print Article
Next Story
More Stories