పవన్ సంచలన కామెంట్స్ : నాపై ఐటీ దాడులు జరుగుతున్నాయి

Submitted by arun on Wed, 03/07/2018 - 17:10
pk

కేంద్ర ప్రభుత్వం అన్నీ రాష్ట్రాల‌ను బెదిరించి, ప‌రిపాలించాల‌ని చుస్తోంద‌న్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్. కేంద్రం అన్ని రాష్ట్రాల పట్ల బాధ్యత‌గా వ్యవ‌హారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా అంశంలో అన్నీపార్టీలు.. ప్రజ‌ల బాగ‌స్వామ్యం లేకుండానే పోరాటం చేస్తోన్నాయిని పవన్ ఆరోంచారు.

బీజేపీ, టీడీపీల దొస్తీ దాదాపు క‌టీఫ్ అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప‌ట్ల బెదిరింపు దొర‌ణి అవలంబిస్తోందని ఆరోపించారు‌. థర్డ్ ప్రెంట్ అంటే అంద‌రూ అధికారం కోసమేనని అనుకుంటున్నారాని.. కానీ ఈ వేదిక హాక్కుల సాధ‌న కోస‌మ‌ని పవన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ప‌ట్ల చిన్న చూపుతో వ్యవహరిస్తోందన్నారు. త‌మ‌ని ప్రశ్నించిన వాళ్ళను కేసుల పేరుతో బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మధ్య నాపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని సంచలన కామెంట్స్ చేశారు

ప్రత్యేక హోదా అంశంలో అన్ని పార్టీలు ప్రజ‌ల బాగ‌స్వామ్యం లేకుండా ఉద్యమాలు చేస్తాన్నాయ‌ని.. అయితే, ఇలాంటి ఉద్యమాలు అంత‌గా వ‌ర్కవుట్ అవ‌్వవ‌ని జనసేన అధినేత చెప్పారు. దీంతో పాటు మార్చి 14న అన్నీ అంశాల‌పై క్లారీటీ ఇస్తాన‌ని ప‌వ‌న్ తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ త‌న‌ను రాజ‌కీయ‌ల్లో చిన్న పిల్లాడిని అనుకుంటున్నాయ‌ని అయితే త‌న స్టాండ్ ఎంటో 2019 ఎన్నిక‌ల్లో చెబుతాన‌న్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వక‌పోతే, సౌత్ అండ్ నార్త్ తేడాలొస్తాయ‌ని తాను మోడితో ఎప్పుడో చెప్పాన‌న్నారు ప‌వ‌న్. రాష్ట్రంలో ప్రత్యేక హోదాపై పోరాటం చేయ‌డానికి స‌రైన నాయ‌కత్వం లేద‌ని పవన్ తెలిపారు.

English Title
IT raids conducted against me: Pawan Kalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES