తెలంగాణలో పొలిటికల్ హీట్...బద్ధశత్రువులు దోస్తీ కడుతారా ?

Submitted by arun on Tue, 07/31/2018 - 10:19

2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు పొత్తులపైనే దృష్టి పెట్టాయ్. కొన్ని పార్టీలు ఒంటరి పోరుకు సిద్ధమవుతుంటే మరి కొన్ని పార్టీలు పొత్తులతోనే ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నాయ్. జాతీయ రాజకీయాల్లో పరిస్థితి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై రోజుకో కొత్త ప్రచారం నడుస్తోంది. తెలంగాణలో పొత్తులతో ఎన్నికలు వెళ్లే పార్టీ ఏదీ ? సింగిల్‌ పోటీ చేసే పార్టీలెన్నీ ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌. పొత్తులపై నేతలేమంటున్నారు. 

2019 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ కాలేదు. సాధారణ ఎన్నికలకు టైమున్నా పార్టీలు, రాజకీయ నేతల మధ్య వార్ నడుస్తూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదేనంటూ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలపై టీఆర్ఎస్‌, టీడీపీ, కాంగ్రెస్‌లు దృష్టి సారించాయ్‌. గెలుపే లక్ష్యంగా వలసలను ప్రొత్సహిస్తూ కీలకమైన నేతలను పార్టీలోకి చేర్చుకుంటోంది టీ కాంగ్రెస్‌. బోడుప్పల్‌లో జరిగిన కాంగ్రెస్‌ సభలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్‌ కలిసి వెళ్లే అవకాశం ఉందనడంతో రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ పొత్తులపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను కేసీఆర్‌ ఒంటి చేత్తో గెలిపిస్తారని సింహం సింగిల్‌ వస్తుందన్నారు. కాంగ్రెస్‌, తెలుగుదేశంతో పాటు మరో రెండు మూడు పార్టీలు ఏకమైనా ఒక్కొక్కరికి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు ఓటేస్తారని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ హైకమాండ్‌ నిర్ణయిస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన పొత్తులు లేక పోయినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సెటిలర్లకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామని చెప్పారు. సర్వే చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కూడా ఖండించకపోవడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ దోస్తీ కడుతాయన్న ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లవుతోంది. 

English Title
IT Minister KTR Comments on TDP and Congress

MORE FROM AUTHOR

RELATED ARTICLES