రైతు రుణ‌మాఫీకి ఈసీ గ్రీన్‌సిగ్న‌ల్‌..

రైతు రుణ‌మాఫీకి ఈసీ గ్రీన్‌సిగ్న‌ల్‌..
x
Highlights

రైతుల రుణాలను మాఫీ చేసేందుకు మధ్యప్రదేశ్ సర్కార్‌కి కేంద్ర ఎన్నిక‌ల సంఘం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన ఆయా నియోజకవర్గాల్లో రైతుల...

రైతుల రుణాలను మాఫీ చేసేందుకు మధ్యప్రదేశ్ సర్కార్‌కి కేంద్ర ఎన్నిక‌ల సంఘం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన ఆయా నియోజకవర్గాల్లో రైతుల రుణామాఫి చర్చలు చేపట్టవచ్చని నేడు(శుక్రవారం) కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఇటీవ‌ల జ‌రిగిన హోరాహోరి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ విజకేతనం ఎగువేసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అక్కడి ముఖ్యమంత్రి క‌మ‌ల్‌నాథ్ రాష్ట్ర రైతుల‌కు రుణ‌మాఫీ క‌ల్పించాల‌నుకున్నారు. అయితే ఎన్నిక‌ల నియ‌మావ‌ళి వేళ మాఫీ ఎలా చేస్తార‌ని ప్ర‌తిప‌క్షాలు భగ్గుమన్నాయి. దీంతో ఈసీని ఆశ్రయించారు. కాగా ఎన్నిక‌లు ముగిసిన నియోజ‌క‌వ‌ర్గాల్లోని రైతుల‌కు రుణ‌మాఫీ చేయ‌వ‌చ్చు అని ఈసీ త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. దీంతో మధ్యప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 4.5 ల‌క్ష‌ల రైతుల‌కు రుణ‌మాఫీ ల‌బ్ధి జ‌ర‌గ‌నున్న‌ది.

Show Full Article
Print Article
Next Story
More Stories