బుధవారం జీశాట్- 29 ప్రయోగం

బుధవారం జీశాట్- 29 ప్రయోగం
x
Highlights

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది.. శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం...

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది.. శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం 5.08 గంటలకు జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు. దీని ద్వారా జీశాట్-29 ఉపగ్రహం రోదసీలోకి పంపనున్నారు. ఈప్రయోగం కోసం ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది... బుధవారం సాయంత్రం 5.07 గంటల వరకు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం 5.08 గంటలకు మార్క్-3 రాకెట్ ద్వారా 3600 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. కాగా, సమాచార సాంకేతికతను మరింత బలోపేతం చేసేందుకు జీశాట్-29 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగిస్తోంది. గత ఏడాది ప్రయోగించిన జీశాట్-19 ఉపగ్రహంతో ఇప్పటికే కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories