రిలీజ్ కి ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న "సాహో".

రిలీజ్ కి ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సాహో.
x
Highlights

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా "సాహో". "బాహుబలి" లాంటి భారీ బడ్జెట్ సినిమా తరువాత ఈ సినిమాని కూడా హై బడ్జెట్ తో పూర్తి...

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా "సాహో". "బాహుబలి" లాంటి భారీ బడ్జెట్ సినిమా తరువాత ఈ సినిమాని కూడా హై బడ్జెట్ తో పూర్తి చేస్తున్నాడు ప్రభాస్. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే రిలీజ్ కి ముందే ఈ సినిమా రికార్డ్స్ సెట్ చెయ్యడం స్టార్ట్ చేసింది.

అవును ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్ ని ఫార్స్ అనే సంస్థ దాదాపు 42 కోట్లు పెట్టి కొన్నారు అంట. అసలు ఇండియా లోనే ఒక సౌత్ సినిమా కి ఈ రేంజ్ లో పెట్టడం ఇదే మొదటి సారి. సినిమా తెలుగు, హిందీ, తమిళ బాషల్లో తెరకెక్కుతుంది కాబట్టి తప్పకుండా సినిమా అంతకు మించి వసూలు చేస్తుంది అని ట్రేడ్ పండితుల అంచనా. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది ఆగస్ట్ 15 న "సాహో" సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories