చంద్రబాబును తిట్టొచ్చు కానీ ఇలా తిడితే మాత్రం దెబ్బే జానీ!

చంద్రబాబును తిట్టొచ్చు కానీ ఇలా తిడితే మాత్రం దెబ్బే జానీ!
x
Highlights

"రాజకీయం" ఇదో చదరంగం అనే చెప్పవచ్చు. ఈ రంగంలోకి దిగిన వారు ఏ రేంజ్‌లో ఉంటారో అందరికి తెలుసు కదా! రాజకీయ రణరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వెస్తుంటారు...

"రాజకీయం" ఇదో చదరంగం అనే చెప్పవచ్చు. ఈ రంగంలోకి దిగిన వారు ఏ రేంజ్‌లో ఉంటారో అందరికి తెలుసు కదా! రాజకీయ రణరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వెస్తుంటారు నాయకులు. ఈ నేపథ్యంలో ఈ రాజకీయల్లో ఒకరిపై మరోకరు తిట్టుకోవటం, తిట్టించుకోవడం ఈ రెండు మామూలే అనుకో కానీ ఈ రెండు హద్దుల్లో ఉండాలి. కొంచెం నోరు జారీనా కానీ ప్రజలు రియాక్ట్ అయ్యే తీరుతో జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు సుమా! ఎన్నికల్లో ఒకరిపై మరోకరు ఏ రేంజ్ లో ఒకరిపై మరోకరు తిట్టుకున్న తీరు మీకు తెలిసిందే అనుకో అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత వ్యాఖ్యల తీవ్రతను పెంచుతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేతలు బాబుపై తీవ్ర విమర్శలు చేస్తుంటం చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో గెలుపు ధీమా కావొచ్చు, అధికారం తమదే అన్న ఉత్సాహంలోనూ ఈ తరహా హడావుడి మామూలే. కాగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత అధికారపక్షం మర్యాదపూర్వకంగా వ్యవహరించటాన్ని ప్రజలు హర్షిస్తారు. అంతే కానీ ఓడిన వారిని ఇష్టారాజ్యంగా మాటలు అనేయటాన్ని ఒప్పుకోరు.

ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇలాంటి సమయంలో బాబుపై వైసీపీ నేతలు ఎడపెడ తిట్టేస్తున్నారు. కానీ బాబుపై చెస్తున్నా వ్యాఖ్యలు సరి కావన్న మాట వినిపిస్తోంది. ఇదే ఎన్నికల ఫలితాలపై ఎవరు ఎలా ఉన్నా కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రికెట్‌లో మిస్టర్ కూల్ గా పేరు ఉన్న దోనిలాగా జగన్ కూడా చాలా కూల్‌గా ఉన్నరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడ కూడా గెలుపు ఓటమిపై ఎక్కడా మాటల హడావుడి చేయటం లేదు. కూల్ గా తుది ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మహమ్మద్‌ జానీ నారా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు అందరిలోనూ చర్చనీయంశంగా మారిందనే చెప్పవచ్చు. అసలు జానీ చేసిన వ్యాఖ్యలు ఎంటంటే రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్‌ వ్యాపారులతో కలిసి గుడ్డి పత్తి అమ్ముకున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీకి 150 సీట్లు వస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఎండల్లో తిరిగి మైండ్‌ పోయిందేమో డాక్టర్‌ దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకో'అంటూ సలహా ఇచ్చారు అంటూ చేసిన వ్యాఖ్యలు సరికావన్న మాట వినిపిస్తోంది. అయితే టీడీపీ నేతల వరకూ ఎవరిని ఉద్దేశించి ఇలాంటి మాటలు అనటం వల్ల ప్రజల్లో అహంకారం ఎక్కువైందన్న భావన కలగటం ఖాయమంటున్నారు. తీర విజయం వరించే వేళ ఎంత ఓపికతో ఉంటే ప్రజల మనసుల్ని మరింతగా దోచుకోవచ్చన్న విషయాన్ని జానీ లాంటి నేతలు గుర్తిస్తే మంచిదని ప్రజలు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories