ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్

ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్
x
Highlights

కేఎల్ రాహుల్ జాక్‌పాట్ కొట్టాడు. ఐపీఎల్ ఆక్షన్‌లో ఊహించని ధరకు అతను అమ్ముడుపోయాడు. రూ.11 కోట్లకు రాహుల్‌ను కింగ్స్ లెవన్ పంజాబ్ టీమ్ కైవసం...

కేఎల్ రాహుల్ జాక్‌పాట్ కొట్టాడు. ఐపీఎల్ ఆక్షన్‌లో ఊహించని ధరకు అతను అమ్ముడుపోయాడు. రూ.11 కోట్లకు రాహుల్‌ను కింగ్స్ లెవన్ పంజాబ్ టీమ్ కైవసం చేసుకున్నది. ఇవాళ మూడవ రౌండ్ వేలంలో రాహుల్ అమ్ముడుపోయాడు. ఇప్పటివరకు ఇవాళ్టి వేలంలో బెన్ స్టోక్స్ తర్వాత రాహుల్‌కు అత్యధిక ప్రైస్ దక్కింది. కరణ్ నాయర్‌ను కూడా కింగ్స్ లెవన్ జట్టు రూ.5.60 కోట్లకు సొంతం చేసుకున్నది. ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ అమ్ముడుపోలేదు. క్రిస్ గేల్ తర్వాత అమ్ముడుపోని రెండవ ప్లేయర్ జోరూట్. మ‌నీష్ పాండే కూడా జాక్‌పాట్ కొట్టాడు. మ‌నీష్ పాండేను హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ టీమ్ కైవ‌సం చేసుకున్న‌ది. అత‌న్ని రూ.11 కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ గెలుచుకున్న‌ది.

మూడో సెట్‌లో అమ్ముడుపోయిన ఆటగాళ్లు
కరుణ్ నాయర్(భారత్)- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్- రూ. 5.60 కోట్లు
కేఎల్ రాహుల్(భారత్)- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్- రూ. 11.0 కోట్లు
డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా)- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్- రూ. 3.0 కోట్లు
అరోన్ ఫించ్(ఆస్ట్రేలియా)- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్- రూ. 6.20 కోట్లు
మెక్‌కల్లమ్(కివీస్)- బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్- రూ. 3.60 కోట్లు
జాసన్ రాయ్(ఇంగ్లండ్)- ఢిల్లీ డేర్‌డెవిల్స్- రూ. 1.50 కోట్లు
క్రిస్ లిన్(ఆస్ట్రేలియా)- కోల్‌కతా నైట్‌రైడర్స్- రూ. 9.60 కోట్లు
మనీష్ పాండే(భారత్)- సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 11 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories