logo

నా సెంచరీ ఆమెకు అంకితం: గేల్‌

నా సెంచరీ ఆమెకు అంకితం: గేల్‌

ఐపీఎల్ 11వ సీజన్లో తాను సాధించిన సెంచరీని ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న తన కుమార్తెకు అంకితమిస్తున్నట్లు కింగ్స్ పంజాప్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ ప్రకటించాడు. తనకు వయసైపోయిందీ తన పనైపోయిందంటూ వేలంలో తనను ఏమాత్రం పట్టించుకోని ఫ్రాంచైజీలు, విమర్శకులకు తన ఈ సెంచరీనే సమాధానమని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొంటూ గేల్ చెప్పాడు. వేలంలో తనను ఫ్రాంచైజీలు
పక్కనపెట్టినా కింగ్స్ పంజాబ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ తనను ఎంపిక చేయడం ద్వారా ఐపీఎల్ ను కాపాడాడని గుర్తు చేశాడు. కనీసం రెండుమ్యాచ్ ల్లో విజయాలు అందించమని తనను సెహ్వాగ్ కోరాడని
గత రెండుమ్యాచ్ ల్లోనూ మ్యాచ్ విన్నర్గా నిలవడం ద్వారా ఇచ్చిన మాట నెరవేర్చుకొన్నానని గేల్ చెప్పాడు.

లైవ్ టీవి

Share it
Top