ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌ ప్రారంభం

ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌ ప్రారంభం
x
Highlights

ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌ ప్రారంభం అయింది. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల కమిషన్...

ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌ ప్రారంభం అయింది. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల కమిషన్ భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం ఇస్కపాలెంలోని 41వ పోలింగ్ కేంద్రం, సూళ్లూరుపేట అటకానితిప్పలోని 197 పోలింగ్ బూత్ లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధి కలనూతలపాడులోని 247వ పోలింగ్‌ బూత్‌లో రీ- పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీ పోలింగ్ జరుగుతుంది. నరసరావు పేట నియోజకవర్గ పరిధిలోని కేసానుపల్లిలో 94వ బూత్‌తో పాటు.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులో 244 వ పోలింగ్‌ బూత్‌లో రీపోలింగ్‌ నిర్వహిస్తున్నారు. గత వైఫల్యాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది అధికారులను ఆదేశించారు. రిజర్వ్ ఈవీఎంలు, వీవీ ప్యాట్ లను పోలింగ్ కేంద్రాల దగ్గర సిద్ధంగా ఉంచారు. సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించేందుకు బెల్ ఇంజనీర్లను ప్రతీ కేంద్రం వద్ద అందుబాటులో ఉంచింది ఎన్నికల కమిషన్.

Show Full Article
Print Article
Next Story
More Stories