సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అజేయ కల్లం

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అజేయ కల్లం
x
Highlights

ఏపీ సీఎం ముఖ్యకార్యదర్శిగా నియమితులైన మాజీ సీఎస్‌ అజేయ కల్లం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డిని కలిశారు. కాగా అజేయ కల్లం కేబినెట్‌ హోదాతో సీఎం ముఖ్య...

ఏపీ సీఎం ముఖ్యకార్యదర్శిగా నియమితులైన మాజీ సీఎస్‌ అజేయ కల్లం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డిని కలిశారు. కాగా అజేయ కల్లం కేబినెట్‌ హోదాతో సీఎం ముఖ్య సలహాదారుగా నియమితులయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను కీలక పదవిలో నియమించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అజేయ కల్లం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎం పేషీ) అధిపతిగా వ్యవహరిస్తారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. అజేయకల్లం పేషికి పది మంది సిబ్బందిని కేటాయించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శులతో పాటు ప్రభుత్వ సలహాదారులందరికీ అజేయ కల్లం నాయకత్వం వహించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories