సుప్రీంకోర్టుకు రాహుల్‌గాంధీ భేషరతు క్షమాపణలు

సుప్రీంకోర్టుకు రాహుల్‌గాంధీ భేషరతు క్షమాపణలు
x
Highlights

చౌకీదార్‌ చోర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టుకు భే షరతు క్షమాపణలు చెప్పారు. తనపై నమోదైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను...

చౌకీదార్‌ చోర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టుకు భే షరతు క్షమాపణలు చెప్పారు. తనపై నమోదైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను కొట్టేయ్యాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి రాహుల్‌ తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేశారు. గతంలో చౌకీదార్‌ చోర్‌ అని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పిందంటూ రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చేయని వ్యాఖ్యలను తమపై ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించింది. అయితే రాహుల్‌ తాజా అభ్యర్థనపై విచారణను సుప్రీంకోర్టు ఈ శుక్రవారం వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories