'సైరా' సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

సైరా సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం
x
Highlights

'సైరా' సెట్‌లో భారీ అగ్ని ప్రమాదంమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి...

'సైరా' సెట్‌లో భారీ అగ్ని ప్రమాదంమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం కోకాపేట‌లోని చిరంజీవి ఫార్మ్ హౌస్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో జ‌రుగుతుంది. అయితే ఈ సెట్‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఫాం హౌజ్ నుండి ద‌ట్ట‌మైన పొగ‌లు, మంట‌లు వ‌స్తుండడాన్ని గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. గండిపేట లేక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థతిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో సెట్‌ పూర్తిగా కాలిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల‌న జ‌రిగిందా లేదంటే మ‌రేదైన కార‌ణం వ‌ల‌న జ‌రిగిందా అనే దానిపై విచార‌ణ జ‌రుపుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.





Show Full Article
Print Article
Next Story
More Stories