కార్తీ చిదంబ‌రానికి బెయిల్ మంజూరు

Submitted by lakshman on Fri, 03/23/2018 - 15:33
INX Media case: Karti Chidambaram granted bail by Delhi high court

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు లో మాజీ కేంద్ర‌మంత్రి పీ.చిదంబ‌రం కుమారుడు కార్తీ చిదంబ‌రానికి ఢిల్లీ హైకోర్టు లో ఊర‌ట ల‌భించింది.  
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో యూకే నుంచి వస్తున్న కార్తిని చెన్నై ఎయిర్‌పోర్టులో సీబీఐ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐఎన్‌ఎక్స్ మీడియాకు విదేశాల నుంచి వచ్చిన రూ.307 కోట్ల నిధులకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాకాల బోర్డ్ ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులోనే కార్తీకి రూ.10 లక్షల ముడుపులు ముట్టినట్లు మొదట్లో సీబీఐ ఆరోపించింది. ఆ తర్వాత ఆ మొత్తం రూ.6.5 కోట్లగా పేర్కొంది.దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ ద‌ర్యాప్తులో భాగంగా కేసు ప‌లుమార్లు విచార‌ణ‌కు రాగా కోర్టు కార్తీ కి బెయిల్ మంజూరు చేయ‌డానికి అభ్య‌త‌రం వ్య‌క్తం చేసింది. ఈనేప‌థ్యంలో ఢిల్లీ హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్ త‌మకు ఇవ్వాల‌ని, కేసు కొలిక్కి వ‌చ్చే వ‌ర‌కు విదేశాల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని ష‌ర‌తులు విధించింది. అంతేకాక బెయిల్‌ మంజూరు కోసం రూ.10 లక్షలను పూచీకత్తును సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.
కాగా  కార్తీ చిదంబరాన్ని సీబీఐ అధికారులు  అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన్ను అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన కార్తీ చిదంబరం మామూలు వ్యక్తి కాదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విడుదల చేసిన సమ్మన్లపై స్టే విధించలేమని సుప్రీం కోర్టు.. కార్తీకి షాక్ ఇచ్చింది. దీంతో బుధవారం అధికారులు వచ్చీరాగానే ఆయన్ను అరెస్ట్ చేశారు. కాగా, కార్తీ చిదంబరం సీఏ ఎస్ భాస్కరన్‌కు సోమవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు 14 రోజులు జుడిషియల్ కస్టడీ విధించింది. ఐఎన్ఎక్స్ మీడియా కోసం విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతులకు సంబంధించి 2007లో విదేశాల నుంచి రూ.305 కోట్లను అక్రమంగా తీసుకున్నారన్న ఆరోపణలపై ఈడీ, సీబీఐలు కార్తీ చిదంబరంపై కేసులు నమోదు చేశాయి. తాజాగా అరెస్ట్ చేశాయి. 
 

English Title
INX Media case: Karti Chidambaram granted bail by Delhi high court

MORE FROM AUTHOR

RELATED ARTICLES