logo

‘ఇంటిలిజెంట్’ టాక్: తేజూ మళ్లీ దెబ్బకొట్టాడు!

‘ఇంటిలిజెంట్’ టాక్: తేజూ మళ్లీ దెబ్బకొట్టాడు!

హిట్టు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్. వరుస ప్లాపులతో డీలా పడిపోయిన ఈ మెగా హీరో ఇంటెలిజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. వివి వినాయక్ డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఇంటిలిజెంట్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.

జవాన్ ప్లాప్ తర్వాత సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ ఈసారి కూడా సుప్రీమ్ హీరో సోసో అనిపించాడు. యాక్టింగ్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ..సన్నివేశాల్లో యాక్షన్ డోస్ మరీ ఎక్కువయ్యింది. లావణ్య త్రిపాఠి గ్లామర్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

హై ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఇంటిలిజెంట్ ని లాజిక్ లేని సన్నివేశాలు దెబ్బతీశాయి. తమన్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. లిరిక్ ని డామినేట్ చేసే సంగీతం ఆడియన్స్ కు చికాకు కల్గిస్తుంది. సాయిధరమ్ తేజ్ తన ఓన్ పెర్ఫార్మెన్స్ కంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్లనిపిస్తుంది. మొత్తానికి ఇంటిలిజెంట్ సినిమాకి ఆడియన్స్ నుంచి యావరేజ్ టాక్ వినిపిస్తుంది.

లైవ్ టీవి

Share it
Top