ఒకప్పుడు వీఐపీల డ్రైవర్‌... ఇప్పుడు కౌలురైతు

balaraju
x
balaraju
Highlights

ఒకప్పుడు అతడు రాష్ట్రపతి కాన్వాయ్‌ కారు డ్రైవర్‌. సీఎం, మంత్రుల వాహనాలకు డ్రైవర్‍ గా పనిచేశాడు. ఎందరో ప్రముఖులకు కారు డ్రైవర్ గా సేవలు అందించిన అతడు విధిలేని పరిస్థితుల్లో కౌలురైతుగా మారాడు.

ఒకప్పుడు అతడు రాష్ట్రపతి కాన్వాయ్‌ కారు డ్రైవర్‌. సీఎం, మంత్రుల వాహనాలకు డ్రైవర్‍ గా పనిచేశాడు. ఎందరో ప్రముఖులకు కారు డ్రైవర్ గా సేవలు అందించిన అతడు విధిలేని పరిస్థితుల్లో కౌలురైతుగా మారాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలానికి చెందిన ఇతడి పేరు గోవుల బాలరాజు. హైదరాబాద్ లో ఇతడికి వీఐపీల కారు డ్రైవర్ గా పేరు ఉంది. గతంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు డ్రైవర్ గా పని చేసిన ఇతడు కౌలు రైతుగా మారాడు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో సీఎం కిరణ్ కుమార్ తో పాటు మంత్రుల కార్లు నడిపించాడు బాలరాజు. పలువురు ఐఏఎస్‌ అధికారులకు డ్రైవర్ గా సేవలు అందించాడు. నాటి రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చినప్పుడు రాష్ట్రపతి కాన్వాయ్‌ కారు డ్రైవర్‌ గా ఉన్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వీఐపీ వాహనాల డ్రైవర్ల కంట్రాక్టును ఓ సంస్థకు అప్పగించడంతో బాలరాజు ఉపాధి కోల్పోయాడు.

హైదరాబాద్ లో ఉద్యోగం కోల్పోయిన బాలరాజు సొంత ఊరు పెంట్లవెల్లికి వచ్చాడు. స్థానిక జడ్పీటీసీ సభ్యుడు ఇచ్చిన స్థలంలో పూరిగుడిసె వేసుకున్నాడు. గోపాలాపురంలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం, హమాలీ పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. సాధారణంగా వీఐపీల వద్ద డ్రైవర్లుగా పని చేసేవారు వారి పేర్లు చెప్పి లేదా వారి మెప్పు పొంది ఏదోవిధంగా లబ్ధి పొందుతారు. కానీ బాలరాజు నీతి, నిజాయితీతో విధులు నిర్వహించాడు. వీఐపీల పేర్లను ఎక్కడ వాడుకోలేదు. తనకు ఉద్యోగం పర్మినెంట్ కాకపోగా ఉన్న ఉద్యోగం ఊడిపోవడంపై బాలరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో తాను ప్రముఖులకు అందించిన సేవలను గుర్తించి తిరిగి వీఐపీల డ్రైవర్ గా ఉపాధి కల్పించాలని భార్య బిడ్డలతో కలిసి నాగరాజు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories