ఇందిరమ్మ మనవడు

Submitted by arun on Tue, 08/14/2018 - 13:14
rahul gandhi, indira gandhi

ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ను సిద్ధం చేస్తూ,

రాహుల్ గాంధీ ద్విముఖ వ్యూహం నడుపుతూ,

కలిసొచ్చే పార్టీలతో సై అని దోస్తీ కడుతూ,

సొంత పార్టీని మరింత బలోపేతం చేస్తూ,

సాగిపోతున్న ...ఇందిరమ్మ మనవడు. శ్రీ.కో. 

రాబోవు ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ను సిద్ధం చేస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఓ వైపు కలిసొచ్చే పార్టీలతో దోస్తీ కడుతూ మరోవైపు సొంతంగా పార్టీని బలోపేతం చేయడంపై తమ శక్తిని ఖర్చు పెడుతున్నాడు. యూపీ ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీతో, కార్నాటకలో జేడీఎస్‌తోను కలిసి బీజేపీకి షాకిచ్చిన రాహుల్ ఇప్పడు మరింత స్పీడ్ పెంచారు. ఉత్తరాదిలో బీజేపీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికే ఆయన రాజస్థాన్‌లో పర్యటించారు. ఇదే సమయంలో దక్షిణాదిపై దృష్టిపెట్టారు. తెలంగాణలో పార్టీని సరైన దిశ మరియు దశలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఇచ్చి కూడా ప్రయోజనం లేకపోవడంతో ఈ సారి ఎలాగైన కాంగ్రెస్ జండా రాష్రంలో ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్నారు.

English Title
Indiramma grandson

MORE FROM AUTHOR

RELATED ARTICLES