నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని కీలక ప్రసంగం

నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని కీలక ప్రసంగం
x
Highlights

నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవడంలో రాష్ట్రాల పాత్రను తెలియజేస్తూ .. కేంద్రం...

నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవడంలో రాష్ట్రాల పాత్రను తెలియజేస్తూ .. కేంద్రం నిర్ధేశించుకున్న మహోన్నత లక్ష్యాలను సాధించేందుకు కలిసి నడుద్దామంటూ పిలుపునిచ్చారు. సువిశాల దేశంలో ఎన్నికల తంతు ముగిసినందున రాజకీయాలను పక్కనబెట్టి ... దేశాభివృద్ధి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.

సబ్‌కా సాత్‌ , సబ్ కా వికాస్‌ సాధించడంలో నీతి అయోగ్ దే కీలకపాత్ర అన్న మోడీ ... ప్రపంచంలోనే భారత్ బలమైన మూడో ఆర్ధిక వ్యవస్ధగా పరుగులు పెడుతోందన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక శక్తిగా భారత్ ను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఆదాయ పెంపు, ఉపాధి కల్పన ద్వారే ఈ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామన్న ప్రధాని ..ఇందులో ఎగుమతులదే కీలకపాత్ర అన్నారు. ఎగుమతుల రంగాన్ని ప్రోత్సహించడంపై దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు పని చేయాలన్నారు .

ఇదే సమయంలో దేశం ఎదుర్కొంటున్న అంశాలను ప్రస్తావించిన మోడీ .. కలిసికట్టుగా సాగుదామన్నారు. పేదరికం, నిరుద్యోగం, కరువు, పకృతి వైపరిత్యాలు, కాలుష్యం, అవినీతి ..హింసలపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జాతి పిత మహాత్మగాంధీ 150 వార్షికోత్సవం సందర్భంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నప్పుడే ... మహాత్ముడికి ఘన నివాళి సాధ్యమవుతుందన్నారు.

మానవాళికి సవాల్ విసురుతున్న తాగు, సాగు నీటి సమస్యలను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. జలవనరుల సమర్ధ వినియోగం, పునరుత్పత్తి కోసం జల్ శక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. ఈ శాఖ ఆధ్వర్యంలోనే నీటి వినియోగంపై సమగ్ర విధానం రూపొందిస్తామన్నారు .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories