ఒక్క సినిమా కోసం 7 సినిమాలకు నో చెప్పిన హీరోయిన్

ఒక్క సినిమా కోసం 7 సినిమాలకు నో చెప్పిన హీరోయిన్
x
Highlights

కన్నడ సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమా 'కె జి ఎఫ్'. ఈ సినిమాతో కేవలం కన్నడ ప్రేక్షకులలో మాత్రమే పరిమితం అయిన రాకింగ్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్...

కన్నడ సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమా 'కె జి ఎఫ్'. ఈ సినిమాతో కేవలం కన్నడ ప్రేక్షకులలో మాత్రమే పరిమితం అయిన రాకింగ్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు దేశమంతటా వ్యాపించింది. ఈ సినిమా కన్నడ రికార్డులను తిరగరాసింది. సంచలన విజయం సాధించిన ఈ సినిమాతో నటీనటులందరూ పాపులర్ అయిపోయారు. హీరో యశ్ మాత్రమే కాక హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కనిపించింది కొన్ని సీన్లలో మాత్రమే అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకుని ప్రేక్షకులను మెప్పించింది శ్రీనిధి.

ఇక ఈ సినిమా తర్వాత శ్రీనిధి కి వెంటవెంటనే కన్నడ, తెలుగు తమిళ భాషల నుంచి 7 సినిమా ఆఫర్లు వచ్చాయని తెలుస్తోంది. కానీ మరోవైపు ఈ భామ 'కే జి ఎఫ్: చాప్టర్ 2' సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఈ సినిమా కోసం ఎప్పుడు ఎన్ని డేట్లు అవసరం అవుతాయో తెలియదు. కాబట్టి 7 సినిమాలను వదులుకోవాల్సివచ్చిందట. కానీ మిగతా ఏడు సినిమాల గురించి ఆలోచిస్తే 'కేజీఎఫ్ టూ' లాంటి భారీ చిత్రంలో నటించడం గురించి మర్చిపోవాలి. అందుకే కాబోలు శ్రీనిధి శెట్టి మిగతా అన్ని చిత్రాల కంటే 'కే జీ ఎఫ్ 2' కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇక 'కే జి ఎఫ్ 2' సినిమా తరువాత ఈమెకు మళ్ళీ అలానే ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories