టాయిలెట్ సౌకర్యం లేని భారత హాకీ జూనియర్ ప్లేయర్

Submitted by arun on Thu, 01/11/2018 - 12:24
Khushboo Khan

సొంత టాయిలెట్లు ఏర్పాటు చేసుకోండంటూ కేంద్రప్రభుత్వం ఓ వైపు దేశవ్యాప్తంగా భారీస్థాయిలో ప్రచారం చేస్తుంటే మరోవైపు బీజెపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఓ జాతీయస్థాయి హాకీ ప్లేయర్ కుటుంబం..మరుగుదొడ్డి లేక సతమతమైపోతోంది. భోపాల్ లోని మురికివాడల్లో నివసించే ఖుష్బూ ఖాన్ భారత జూనియర్ మహిళల జట్టులో గోల్ కీపర్ మాత్రమే కాదు 33 మంది సభ్యుల భారత మహిళాహాకీ జట్టులో సభ్యురాలు కూడా. అయితే 17 ఏళ్ల ఖుష్బూ ఖాన్ నివాసమంటున్న రేకుల షెడ్డులోని కొంత భాగాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆరునెలల క్రితం కూలగొట్టింది. పశువుల ఆస్పత్రి విస్తరణ కోసం కూలగొట్టిన భాగంలోనే..ఖుష్బూ ఖాన్ కుటుంబానికి చెందిన మరుగుదొడ్డి సైతం ఉంది. గత ఆరునెలలుగా తమ కుటుంబం టాయిలెట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతోందని...తమకంటూ ఓ మరుగుదొడ్డి నిర్మించి ఇవ్వాలంటూ...రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మొరపెట్టుకొంది. మరి ఎంపీ ముఖ్యమంత్రి ఖుష్బూ మొరను ఎంత త్వరగా ఆలకించి న్యాయం చేస్తారో వేచిచూడాలి.


 

English Title
Indian Junior hockey team goalkeeper Khushboo Khan struggling for a toilet at her home

MORE FROM AUTHOR

RELATED ARTICLES