ఎన్నారై లకు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్న కేంద్రం..!

Highlights

ప్రవాస భారతీయులకు త్వరలో కేంద్రప్రభుత్వం శుభవార్త ప్రకటించబోతుంది .. ఎన్నారైలు పోస్టల్‌ లేదా ఈ-బ్యాలట్‌ ద్వారా ఓటు చేసేందుకు అవకాశం కల్పించే బిల్లును...

ప్రవాస భారతీయులకు త్వరలో కేంద్రప్రభుత్వం శుభవార్త ప్రకటించబోతుంది .. ఎన్నారైలు పోస్టల్‌ లేదా ఈ-బ్యాలట్‌ ద్వారా ఓటు చేసేందుకు అవకాశం కల్పించే బిల్లును ప్రభుత్వం శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిన్న సుప్రీం కోర్టుకు తెలిపింది.. కాగా ఎన్నారై ఓటు హక్కు వివరాలపై సుప్రీం కోర్ట్ లో దాఖలైన పిటిషన్, విచారణను 12 వారాల పాటు వాయిదా వేసింది.. దీనిపై సీజే దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.. ఈ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్ పరిధిలో ఉండటం వలన ఆమోదించడానికి దాదాపు ఆరునెలల సమయం పట్టే అవకాశం ఉందని దీంతో ఈ పిటిషన్ ను 6 నెలల పాటు వాయిదా వేయాలని కేంద్రం తరఫున న్యాయవాది పీకే డే సుప్రీం ను కోరారు.. ఆయనతో ఏకీభవించి 12 వారాలు మాత్రమే వాయిదాకు ధర్మాసనం అంగీకరించింది...

కాగా ఈ ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినట్టయితే, ప్రవాస భారతీయులు ఇండియాలో తాము నచ్చిన అభ్యర్ధికి ఓటు వేసే అవకాశం పోస్టల్‌ లేదా ఈ-బ్యాలట్‌ ద్వారా పొందవచ్చు.. ఇంతవరకు ఈ సౌలభ్యం లేక ఎన్నారైలు కొంతమంది తమ రాష్ట్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.. అంతేకాదు ఎన్నారైల ఓటుహక్కు వినియోగ శాతం ప్రస్తుతం తక్కువగా ఉండగా, అది వచ్చే సాధారణ ఎన్నికలనాటికి క్రమంగా పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. దీంతో త్వరలో ఈ విధానం అమల్లోకి రానున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఇప్పటినుంచే రాజకీయ పార్టీలు ఎన్నారై ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారంట..

Show Full Article
Print Article
Next Story
More Stories