రీపోలింగ్‌పై అప్పుడే నిర్ణయం : ద్వివేది

రీపోలింగ్‌పై అప్పుడే నిర్ణయం : ద్వివేది
x
Highlights

ఏపీలో 80 శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 65.96 శాతం...

ఏపీలో 80 శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 65.96 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపారు. పోలింగ్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వివేది మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 25 హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. కాగా ఘర్షణల్లో ఇద్దరు మృతిచెందారని, ఆరుచోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసారని తెలిపారు. పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై రిటర్నింగ్ అధికారి నుంచి నివేదిక తీసుకుంటామని వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని వెల్లడించారు. రాజకీయపార్టీలు రీపోలింగ్ కూడా కోరుతున్నాయని, అయితే కేంద్ర ఎన్నికల పరిశీలకుల స్క్రూటీని తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈవీఎంలు మొరాయింపుతో ఏపీలోని ఓటర్లు తీవ్ర ఇబ్బందిపడ్డారని చాలాచోట్ల ఈవీఎంల సమస్యతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందని తెలిపారు.

ఇక ఏపీలో ఎన్నికలలో భాగంగా ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పులివెందులలో వైఎస్ జగన్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి, బాలకృష్ణ , రోజా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories