కోల్ కతా టెస్టు కు కౌంట్ డౌన్.. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో టీమిండియా

Highlights

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో మరో వన్ సైడెడ్ సిరీస్ కు భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మూడుమ్యాచ్ ల సిరీస్...

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో మరో వన్ సైడెడ్ సిరీస్ కు భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ పోటీలో 7వ ర్యాంకర్ శ్రీలంకపై విజయమే లక్ష్యంగా ఆతిథ్య టీమిండియా బరిలోకి దిగుతోంది. గత ఆరుమాసాలలో ఆరు టెస్ట్ విజయాలు సాధించిన టీమిండియా శ్రీలంకపై వరుసగా నాలుగో విజయానికి ఉరకలేస్తోంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా ముగ్గురు స్పిన్నర్లా లేక ముగ్గురు పేసర్లా అన్న సందిగ్దంలో ఉంది. సౌతాఫ్రికా టూర్ ను దృష్టిలో ఉంచుకొని మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ లను బరిలోకి దించే అవకాశాలున్నాయి.

రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లలో ఇద్దరికి మాత్రమే తుదిజట్టులో చోటు దక్కనుంది. మొదటి రెండురోజుల ఆటలో పేసర్లకు, ఆఖరి మూడురోజుల ఆటలో స్పిన్నర్లకు అనువుగా ఉండే ఈడెన్ గార్డెన్స్ పిచ్ పైన భారీస్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ క్రికెట్లోనే రెండో అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా ఇప్పటి వరకూ ఆడిన 39 టెస్టు మ్యాచ్ ల్లో 11 విజయాలు, 9 పరాజయాల
రికార్డుతో ఉంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో శ్రీలంక కంటే టీమిండియానే ఎంతో సమతూకంతో మెరుగైనజట్టుగా ఉంది. దానికితోడు శ్రీలంక గడ్డపై మూడుమ్యాచ్ ల సిరీస్ లో క్లీన్ స్వీప్ విజయం సాధించిన టీమిండియా ప్రస్తుత హోం సిరీస్ ను సైతం విజయంతో ప్రారంభించాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు టెస్ట్ క్రికెట్ ఏడో ర్యాంకర్ శ్రీలంక ఇటీవలే ముగిసిన గల్ఫ్ సిరీస్ లో పాకిస్థాన్ ను ఓడించిన ఉత్సాహంతో టీమిండియాకు సవాలు విసురుతోంది. జాదూ స్పిన్నర్ రంగన్ హెరాత్ ప్రధాన అస్త్రంగా విరాట్ ఆర్మీని దెబ్బతీయాలన్న పట్టుదలతో ఉంది.

పాకిస్తాన్ తో ముగిసిన సిరీస్ లో తమజట్టు గొప్పగా ఆడిందని టాప్ ర్యాంకర్ టీమిండియాపైనా అదే దూకుడు కొనసాగిస్తామని శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమల్ ధీమాగా చెప్పాడు. భారత గడ్డపై ఇప్పటి వరకూ తమకు ఒక్క టెస్టు విజయమూలేదని ఆ లోటును కోల్ కతా టెస్ట్ ద్వారా తీర్చుకొంటామని ప్రకటించాడు. కెప్టెన్ చండీమల్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ డిక్ వెల్లా, కరుణరత్నే, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ప్రాక్టీస్ మ్యాచ్ లో అదరగొట్టడంతో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ గాడిలో
పడినట్లే కనిపిస్తోంది.

బౌలింగ్ లో రంగన్ హెరాత్, లెఫ్టామ్ స్పిన్నర్ సండాకన్, ఆఫ్ స్పిన్నర్ దిల్ రువాన్ పెరెరా పైనా శ్రీలంక జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. స్వదేశీ టెస్ట్ సిరీస్ లో టీమిండియాతో ఆడిన మూడుకు మూడుటెస్టుల్లోనూ మొదటి నాలుగురోజుల్లోనే చిత్తుగా ఓడిన శ్రీలంక కోల్ కతా టెస్ట్ లో ఐదురోజులపాటు పోరాడుతుందా? లేక నాలుగురోజుల్లోనే చేతులెత్తేస్తుందా? అన్నదే ఇక్కడి అసలు పాయింట్.

Show Full Article
Print Article
Next Story
More Stories