అదే జోరు.. అదే దూకుడు..

అదే జోరు.. అదే దూకుడు..
x
Highlights

జోరు తగ్గలేదు.. ఊపు ఆగలేదు.. నామమాత్రమైన చివరి వన్డేలోనూ సేమ్ సీన్ రిపీట్ చేశారు. ఆతిథ్య జట్టుపై కనీస కనికరం లేకుండా.. విరుచుకుపడ్డారు. సెంచూరియన్...

జోరు తగ్గలేదు.. ఊపు ఆగలేదు.. నామమాత్రమైన చివరి వన్డేలోనూ సేమ్ సీన్ రిపీట్ చేశారు. ఆతిథ్య జట్టుపై కనీస కనికరం లేకుండా.. విరుచుకుపడ్డారు. సెంచూరియన్ వన్డేలో విక్టరీ కొట్టి.. సరికొత్త చరిత్రను సృష్టించారు. గతంలో ఎవరికీ సాధ్యం కాని లెవెల్లో వన్డే సిరీస్ ను చేజిక్కించుకున్నారు. టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. 5-1 తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని.. సౌతాఫ్రికా ఓటమిని పరిపూర్ణం చేశారు.

మరో అద్భుతమైన విజయంతో కోహ్లీ సేన సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ను ముగించింది. సిరీస్ ను ముందే తన ఖాతాలో వేసుకున్న టీమిండియా లాస్ట్ వన్డేలో హోమ్ టీమ్ ను ఓ ఆటాడుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 46.5 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హాఫ్ సెంచరీతో జోండో ఒక్కడే ఆకట్టుకోగా.. మిగతా ఆటగాళ్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు నమోదుచేయలేదు. టీమిండియా బౌలర్ ఠాకూర్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు.

తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కేవలం రెండు వికెట్లు కోల్పోయి.. టార్గెట్ ను కంప్లీట్ చేసింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో.. విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ ను కళ్లకు కట్టాడు. 19 బౌండరీలు, రెండు సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 96 బంతుల్లో 129 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. వన్డే కెరీర్ లో 35 వ సెంచరీ నమోదు చేశాడు.

32.1 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి టీమిండియా లక్ష్యాన్ని చేరుకుని విజయాన్ని అందుకుంది. వన్డే సిరీస్ ను 5-1 తో కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా కేప్టెన్ కోహ్లీ అందుకున్నాడు. ఈ వన్డే సిరీస్ విజయం.. ఎన్నో రికార్డులను నెలకల్పింది. పాతికేళ్ల క్రితం తొలిసారి ఇక్కడే ఆడిన సిరీస్‌లో భారత్‌ 5 వన్డేలు ఓడగా.. ఇప్పుడు అదే జట్టుపై 5 విజయాలు అందుకోవడం విరాట్‌ సేనకే సాధ్యమైంది. అంతేకాకుండా.. ద్వైపాక్షిక సిరీస్‌లో 500 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ కొత్త చరిత్ర లిఖించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories