పట్టా పాస్ పుస్తకాల కోసం రైతన్నల ఎదురుచూపులు

పట్టా పాస్ పుస్తకాల కోసం రైతన్నల ఎదురుచూపులు
x
Highlights

అవి తాతల కాలం నాటివి. కడుపు నిండా తిండి పెడుతున్నాయి. చేతి నిండా పని కల్పిస్తాయి. అలాంటి భూములకు భూప్రక్షాళనలో పట్టాలు లేకుండా పోయాయి. పట్టా పాస్...

అవి తాతల కాలం నాటివి. కడుపు నిండా తిండి పెడుతున్నాయి. చేతి నిండా పని కల్పిస్తాయి. అలాంటి భూములకు భూప్రక్షాళనలో పట్టాలు లేకుండా పోయాయి. పట్టా పాస్ పుస్తకాల కోసం సర్కార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం. ఏడాది కాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టా పాసు పుస్తకాల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

భూ వివాదాలు పరిష్కరించి రైతులకు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన భూ ప్రక్షాళన పథకం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఇప్పటికీ ఎంతో మంది రైతులు పాస్ పుస్తకాలు అందక కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఒక లక్ష 36 వేల 649 ఖాతాలు ఉండగా 17 వేల 296 ఖాతాలకు పట్టాలు అందలేదు. అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో 85 వేల 277 ‌ఖాతాల్లో 17 వేల 277 ఖాతాలకు పట్టాలు ఇవ్వలేదు. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మొత్తం నాలుగు జిల్లాల్లో లక్ష మందికి పైగా రైతులకు పట్టాలు అందించలేదు. దీంతో వారికి రైతు బంధు డబ్బులు అందని పరిస్థితి ఏర్పడింది. పట్టాపాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల బ్యాంకు రుణాలు లభించడం లేదు. పోనీ వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుందామంటే పట్టా పాస్ పుస్తకాలు లేవు. దీంతో రైతులు పాస్ పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories