సమవుజ్జీల సమరం .. ఇరు జట్ల బలాబలాలు ఇవే

సమవుజ్జీల సమరం .. ఇరు జట్ల బలాబలాలు ఇవే
x
India vs Australia File Photo
Highlights

శ్రీలంకతో జరిగిన మూడు టీ20లో సిరీస్ 2-0తో కైవసం చేసుకుని ఈ ఏడాది విజయంతో ఆరంభించిన టీమిండియా మంగళవారం నుంచి మరో కీలక సమరానికి సిద్ధం కానుంది.

శ్రీలంకతో జరిగిన మూడు టీ20లో సిరీస్ 2-0తో కైవసం చేసుకుని ఈ ఏడాది విజయంతో ఆరంభించిన టీమిండియా మంగళవారం నుంచి మరో కీలక సమరానికి సిద్ధం కానుంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేని ముంబైలోని వాఖండే వేదికగా ప్రారంభం కానుంది. కంగారులపై జరిగే ఈ సమరంలో భారత్ మరో సిరీస్ విజయంపై కన్నేసింది. మంగళవారం ఇరుజట్ల మధ్య తొలి వన్డే మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేయనుంది.

సౌతాఫ్రికా, నుంచి శ్రీలంక జట్టు వరకు అన్నిటిపై విజయం సాధిస్తూ వచ్చిన ఇండియా ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు జట్లు బలబలాల విషయంలో సమవుజ్జీలు అనే చెప్పాలి. అయితే కోహ్లీసేనకు సొంతగడ్డపై జరుగుతుండటం లాభం కలిగిస్తుంది. అయితే గతేడాది సొంతగడ్డలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభావానికి టీమిండియా బదులుతీర్చుకోవాలని తహతహలాడుతుంది. మూడు వన్డేల సిరీస్ లో భారత్ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది.

శ్రీలంక సిరీస్ ముందు శిఖర్ ధావన్ గాయం కారణంతో అతని స్థానంలో రోహిత్ తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్ గా దిగాడు. ఓపెనర్ గా రాహుల్ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. కీలక సమయంలో భాగస్వామ్యం అందించడంతో రాహుల్ అద్బుత ప్రదర్శన చేశాడు. శ్రీలంక సిరీస్‌లో రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో ధావన్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అదరగొట్టాడు.

భారత జట్టు విషయానికి వస్తే ఈ రోహిత్ శర్మ, రాహుల్, ధావన్,లో ఎవరిని ఓపెనర్లుగా దించాలనే విషయం పెద్ద తలనొప్పిగా మారింది. రెగ్యూలర్ ఓపెనర్ రోహిత్ విషయంలో పెద్ద సమస్యలేనప్పటికి ధావన్, రాహుల్ విషయంలో ఎవరిని ఓపెనర్ గాదించాలనేది పెద్దప్రశ్నగా మారింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో వచ్చి రాహుల్ మూడో స్థానంలో పంపిచాలని టీం మేజ్ మెంట్ భావిస్తుంది. ఆల్ రౌండర్ జడేజా ఈ సిరీస్ రాణించాల్సి ఉంటుంది. లేకుంటే తర్వాత సిరీస్ ఎంపిక కష్టమనే చెప్పాలి. శివమ్ దూబే, రిషబ్ పంత్, శ్రేయస్స్ అయ్యార్ తో కూడిన మిడిల్ ఆర్డర్ పటిష్టంగానే ఉంది.

సినియర్ బౌలర్ మహ్మద్ షమీ నేతత్వంలో భారత్ బౌలింగ్ లైనప్ దృఢంగానే ఉంది. అయితే గాయం తర్వాత కొలుకొని జట్టులోకి వచ్చిన బుమ్రా రాణించాల్సి ఉంది. విండీస్ టూర్‌లో కుల్దీప్ యాదవ్ కూడా హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. యువ బౌలర్లలు నవ్‌దీప్ సైనీ, శార్ధుల్ ఠాకుర్‌లలో ఫామ్ లో ఉండడం కలిసోచ్చే అంశం. శార్థుల్ ఠాకుర్ చివర్లో బ్యాటింగ్ చేయగల సమర్థుడు.

మరోవైపు ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా ఉంది. సొండగడ్డపై వరస విజయాలతో రాణించింది. ఇక ఆసీస్ కీలక ఆటగాళ్లు మార్నస్ లబుషేన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్మిత్‌లు బ్యాటింగ్ లైనప్ దుర్భేధ్యంగా ఉంది. మరోవైపు మిచెల్ స్టార్క్, కమిన్స్, జోష్ హజల్ వుడ్‌లతో బౌలింగ్ బలంగా ఉంది. మొత్తానికి ఇరు జట్లు బ్యాటింగ్ బలౌంగ్ లో సమానంగా ఉన్నాయి. దీంతో పండగరోజు జరిగే ఈ మ్యాచ్ రెండు పందేం కోళ్ల మధ్య పోరుగా చెప్పాలి.‎

టాస్

పిచ్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

తుది జట్ల అంచనా :

భారత్

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా/ కేదార్ జాదవ్, , శార్ధుల్ ఠాకుర్, కుల్దీప్, మహ్మాద్ షమీ , బుమ్రా, నవదీప్ సైనీ,

ఆస్ట్రేలియా

డేవిడ్ వార్నర్ , లబుషేన్, అరోన్ ఫించ్, స్మిత్, హ్యాండ్ స్కోంబ్,అష్టోన్ అగర్, అలెక్స్ క్యారీ, హజల్ వుడ్, కమిన్స్, స్టార్క్, జంపా

Show Full Article
Print Article
More On
Next Story
More Stories