ఎన్డీఏ కూటమికే జైకొట్టిన ఎగ్జిట్ పోల్ సర్వేలు

ఎన్డీఏ కూటమికే జైకొట్టిన ఎగ్జిట్ పోల్ సర్వేలు
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయ దుందుభి మోగిస్తుందని వివిధ ఛానెళ్ల సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈసారి బీజేపీ పతనం ఖాయమన్న ఎన్నికలకు ముందు...

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయ దుందుభి మోగిస్తుందని వివిధ ఛానెళ్ల సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈసారి బీజేపీ పతనం ఖాయమన్న ఎన్నికలకు ముందు విశ్లేషణలను తల్లకిందులు చేస్తూ బీజేపీదే విజయమని సర్వేలు చెబుతున్నాయి. కొన్ని ఛానెళ్లు ఏకంగా 365 సీట్ల దాకా గెలవొచ్చని చెబుతున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎన్డీఏ కూటమికి జై కొట్టాయి. బీజేపీ ఎక్కువలో ఎక్కువగా 330-365 సీట్ల దాకా గెలవొచ్చని అంచనా వేశాయి. ఇండియా టీవీ, ఇండియా టుడే, టుడేస్ చాణక్య, వీడీపీఏ, మిషన్ చాణక్య టైమ్స్ నౌ ఛానెళ్ల ఎగ్జిట్ ఫలితాలు బీజేపీకి300కి పైగా సీట్లు దాటతాయని చెబుతున్నాయి. అన్ని సర్వేలు యూపీఏ కూటమి ప్రతిపక్షానికి పరిమితమవక తప్పదని తేల్చి చెబుతున్నాయి. వివిధ ఛానెళ్లు బీజేపీ, కాంగ్రెస్ కూటమిలకు ఎలాంటి ఫలితాలనిచ్చాయో ఓసారి చూద్దాం.

* టైమ్స్ నౌ బీజేపీకి 306 కాంగ్రెస్ కి132 ఇతరులకు 104 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

* ఇక ఎన్డీ టీవీ బీజేపీకి 298, కాంగ్రెస్ కి 128 ఇతరులకు 116 సీట్లు వస్తాయని లెక్క లేస్తోంది.

* రిపబ్లిక్ ఛానెల్ బీజేపీకి 287, కాంగ్రెస్ కి 128 ఇతరులకు 127 సీట్లు రావచ్చని అంచనా వేసింది.

* ఇక ఇండియా టీవీ బీజేపీకి 300, కాంగ్రెస్ కి 120, ఇతరులకు 122 సీట్లు వస్తాయని చెబుతోంది.

* అందరికన్నా ఎక్కువగా ఇండియా టుడే ఛానెల్ బీజేపీకి 339 నుంచి 365 సీట్ల దాకా రావచ్చని ఊహిస్తోంది. కాంగ్రెస్ 77 నుంచి 108 సీట్లు ఇతరులు 69 నుంచి 95 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని చెబుతోంది.

* ఇక ఇతర ఛానెళ్ల సర్వే వివరాలకొస్తే మిషన్ చాణక్య బీజేపీ 8 సీట్లు అటూ ఇటూగా 320 సీట్లు గెలవొచ్చని, కాంగ్రెస్ ఆరు సీట్లు అటూ ఇటూగా 54 సీట్లు గెలవొచ్చని, ఇతరులు 168 సీట్లు గెలుస్తారనీ ఊహిస్తోంది.

* న్యూస్ నేషన్ సర్వే ప్రకారం బీజేపీకి 282- 290 సీట్లు, కాంగ్రెస్ కి 118 నుంచి 126 ఇతరులకు 130నుంచి 138 సీట్లు రావొచ్చు..

* ఇక ఏబీపీ ఛానెల్ బీజేపీకి 267, కాంగ్రెస్ కి 127, ఇతరులకు148 సీట్లు వస్తాయని తేల్చింది.

* న్యూస్ ఎక్స్ ఛానెల్ బీజేపీకి 242 కాంగ్రెస్ కి 162, ఇతరులకు 136 సీట్లు రావొచ్చని గెస్ చేస్తోంది.

* టుడేస్ చాణక్య సర్వే ప్రకారం బీజేపీకి 14 సీట్లు అటూ ఇటూగా 340, కాంగ్రెస్ కు 9 సీట్లు అటూ ఇటూగా 70 సీట్లు, ఇతరులకు 11 స్థానాలు అటూ ఇటూగా 133 సీట్లు రావచ్చునని అంచనా వేస్తోంది.

* VDPA సంస్థ అంచనాల ప్రకారం బీజేపీ 333 సీట్లు గెలుస్తుంది. కాంగ్రెస్ 115, ఇతరులు 94 సీట్లు గెలిచే ఆస్కారముంది.





Show Full Article
Print Article
Next Story
More Stories