ప్రశాంత్ కిశోర్‌ అండ్ టీమ్‌తో జగన్..

ప్రశాంత్ కిశోర్‌ అండ్ టీమ్‌తో జగన్..
x
Highlights

ఏపీ శాసనసభ, లోకసభ ఎన్నికలు ముగియడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాస్తా విశ్రాంతి దొరికినట్లుంది. పోలింగ్ అనంతరం నిన్న (గురువారం) గురువారం...

ఏపీ శాసనసభ, లోకసభ ఎన్నికలు ముగియడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాస్తా విశ్రాంతి దొరికినట్లుంది. పోలింగ్ అనంతరం నిన్న (గురువారం) గురువారం సాయంత్రం హైదరాబాదులో గల తన నివాసం లోటస్ పాండులో మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలుపు మీద జగన్ ధీమాగా ఉన్నారు. పార్టీ అంతర్గత చర్చల్లో వైసీపీకి 110 నుంచి 130 సీట్లు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు. వైసీపీ కోసం తెరవెనుక పనిచేసిన ప్రశాంత్ కిశోర్, ఐప్యాక్ బృందాన్ని జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.

జగన్‌‌ను కలిసిన ప్రశాంత్ కిశోర్‌ ఏపీలో నిన్న పోలింగ్‌ జరిగిన సరళిపై చర్చించారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ జగన్ మోహన్ రెడ్డి పలకరించారు. ఎన్నికలకోసం పనిచేసిన అందరికీ కృతజజ్ఞతలు తెలిపారు. అయితే ఓటింగ్ శాతం పెరగడం వైసీపీకి లాభిస్తుందని జగన్‌కు వివరించారు. ప్రశాంత్ కిశోర్ రెండేళ్లుగా ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కోసం పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన బీహార్ నుంచి వచ్చి హైదరాబాదులోనే ఉంటూ ఎన్నికల వ్యూహాలను రచిస్తూ వచ్చారు. ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలు లోకసభ ఎన్నికల ఫలితాలతో పాటు మే 23వ తేదీన వెలువడనున్న విషయం తెలిసిందే.





Show Full Article
Print Article
Next Story
More Stories