కిలో ఉమ్ము ధర మరీ ఇంతా..?

కిలో ఉమ్ము ధర మరీ ఇంతా..?
x
Highlights

కిలో ఉమ్ము ధర ఏకంగా రూ.కోట్లలో ఉంది. ఇందేంటీ ఉమ్మును కూడా అమ్ముతారా అని అనుకుంటున్నారా.. మీరు చదువుతున్నది నిజంగా నిజమే. ఒకటి కాదు రెండు అక్షరాలా ఒక...

కిలో ఉమ్ము ధర ఏకంగా రూ.కోట్లలో ఉంది. ఇందేంటీ ఉమ్మును కూడా అమ్ముతారా అని అనుకుంటున్నారా.. మీరు చదువుతున్నది నిజంగా నిజమే. ఒకటి కాదు రెండు అక్షరాలా ఒక కోటి డెబ్భై లక్షలు రూపాయలు. అబ్బా.. ఉమ్ము అమ్మకుంటే చాలు కోట్లు సంపాదించవచ్చు అనుకుంటున్నారా.. ఆ ఉమ్మి కలిగి ఉండడం నేరం.

ఎందుకంటే అది మనిషి ఉమ్ము కాదు.. తిమింగలాల్లో ఒక జాతి ఉమ్ము ధర అది.'స్పెర్మ్‌ వేల్' అనే సముద్ర జీవి ఒక రకమైన మైనం లాంటి పదార్థాన్ని నోటి ద్వారా వదులుతుంది. స్పెర్మ్‌ వేల్స్‌ ఉష్ణమండల సముద్రాలలో దీన్ని వదులుతాయి. ఆ జీవి వదిలిన ఉమ్ముని సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగిస్తారు. అందుకే దీనికి అంత విలువ. అయిదే అనుమతులు లేకుండా దీన్ని ఉపయోగించడం చట్టరీత్యా నేరం. గల్ఫ్‌లో దీనికి బాగా డిమాండ్‌ ఉంది. యాంబర్‌గ్రిస్‌ అనే ఈ ద్రవాన్ని మండిస్తే ధనవంతులవుతారనే ఒక మూఢనమ్మకం ప్రజల్లో ఉండటం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories