ప‌ద్ద‌తిగా ట్యాక్స్ క‌ట్టేయ‌మ్మా

ప‌ద్ద‌తిగా ట్యాక్స్ క‌ట్టేయ‌మ్మా
x
Highlights

కోట్లు ఖ‌ర్చుపెట్టి కార్ల‌ను కొనుగోలు చేస్తారు. కానీ ప్ర‌భుత్వానికి ప‌న్నుక‌ట్టే విష‌యంలోనే అతి తెలివిని ప్ర‌ద‌ర్శిస్తారు. అలా అతి తెలివి...

కోట్లు ఖ‌ర్చుపెట్టి కార్ల‌ను కొనుగోలు చేస్తారు. కానీ ప్ర‌భుత్వానికి ప‌న్నుక‌ట్టే విష‌యంలోనే అతి తెలివిని ప్ర‌ద‌ర్శిస్తారు. అలా అతి తెలివి ప్ర‌ద‌ర్శించేవారిలో సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులే ఉండడం గ‌మ‌నార్హం. కొద్దిరోజుల క్రితం కేర‌ళ‌లో రూ. కోటి రూపాయ‌ల విలువ చేసే కారు కొనుగోలు చేసిన హీరోయిన్ అమ‌లాపాల్ రిజ‌స్ట్రేష‌న్ మాత్రం పాండిచ్చేరిలో చేయించింది. స‌మాచారం తెలుసుకున్న కేర‌ళ ట్రాన్స్ పోర్టు అధికారులు 430, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ ద‌ర్యాప్తులో భాగంగా ఆమె సుమారు. 20ల‌క్ష‌ల ప‌న్ను ఎగ్గొట్టిన‌ట్లు తెలుస్తోంది. ప‌న్నుఎవ‌గ‌వేత‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన పోలీసు అధికారులు ఆమెను కేరళ హైకోర్టుకు హాజ‌రు కావాల‌ని హుకుం జారీ చేశారు. ఈ కేసు విచార‌ణ‌లో ఉండ‌గానే పోలీసులకు లొంగిపోయిన‌ ఆమె తప్పుడు పత్రాలు చూపినట్లు ఒప్పుకుంది.
ఇదిలా ఉంటే బాలీవుడ్ కు చెందిన హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా రెండు చేతులా సంపాదిస్తున్నా ట్యాక్స్ క‌ట్టడానికి ప్రాణం ఒప్ప‌దు. ఓవైపు హాలీవుడ్, బాలీవుడ్, ప‌లు కంపెనీల బ్రాండ్ అంబాసీడ‌ర్ గా ఉన్న ఈ బ్యూటీకి ఆయా కంపెనీలు పెద్ద‌మొత్తంలో బ‌హుమ‌తుల్ని క‌ట్ట‌బెట్టారు.
ఓ ఆరేడేళ్ల క్రితం ఈ బ్యూటీకి ఎల్వీఎంహెచ్ ట్యాగ్ కంపెనీ 40లక్షల రూపాయలు విలువచేసే వాచ్‌, టొయేటా 27 ల‌క్ష‌ల విలువైన కారు, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నుంచి 17.06లక్షల ఖ‌రీదు చేసే నెక్లెస్‌, ఒక భవనం బ‌హుమ‌తులుగా ఇచ్చారు.
వాటిపై ప్ర‌భుత్వానికి ఎటువంటి ప‌న్నుక‌ట్ట‌లేదు. దీంతో 2011 లో చేసిన 2011లో చేసిన ఐటీ దాడుల్లో ఈ ఖరీదైన బ‌హుమ‌తుల‌కు ఎలాంటి ర‌శీదులు చూప‌లేక‌పోయింది. అయితే వాటిపై ప‌న్నుక‌ట్టాల‌ని అధికారులు కోరినా . అవి బ‌హుమ‌తుల రూపంలో వ‌చ్చాయి కాబ‌ట్టి వాటికి ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వాల‌ని ఇన్‌కంటాక్స్ ట్రైబ్యున‌ల్‌ను పిటిష‌న్ వేసింది. పిటిష‌న్ పై విచార‌ణ‌చేప‌ట్టిన ట్రైబ్యున‌ల్ ఆదాయపు పన్ను సెక్షన్ 28(4) ప్రకారం కాస్ట్‌లీ బహుమతులకు పన్ను కట్టాల్సిందేనని వారు స్పష్టంగా చెప్పారు. కోట్ల‌లో రెండు చేతులా సంపాదిస్తున్నా ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తుందంటూ నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories