రేవంత్ ఇంట్లో కోటిన్నర నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..

రేవంత్ ఇంట్లో కోటిన్నర నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..
x
Highlights

హైదరాబాద్‌లోని రేవంత్‌రెడ్డి ఇంట్లో 25 గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి కూడా ఐటీ, ఈడీ తనిఖీలు చేసతూనే ఉన్నారు అంతేకాదు రేవంత్‌‌ను...

హైదరాబాద్‌లోని రేవంత్‌రెడ్డి ఇంట్లో 25 గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి కూడా ఐటీ, ఈడీ తనిఖీలు చేసతూనే ఉన్నారు అంతేకాదు రేవంత్‌‌ను నిరంతరాయంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. వివిధ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రేవంత్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. అధికారులు అలాగే రేవంత్‌ ఇంట్లో కోటిన్నర నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అటు హైదరాబాద్‌ జర్నలిస్ట్ కాలనీలోని రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఇంట్లో సోదాలు, విచారణ ముగిసింది.

ఆర్థిక లావాదేవీల అక్రమాలకు సంబంధించి ఐటీ యాక్ట్‌ 54, 55 కింద రేవంత్‌కి నోటీసులు జారీ చేశారు. రేవంత్‌పై బ్లాక్ మనీ, ఇన్‌కం ట్యాక్స్ చట్టం 2015.., ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం 2002..,ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ 1988..,ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద కేసులు నమోదు చేశారు. అలాగే రేవంత్‌పై ఈడీ కోర్టులో ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ దాఖలు చేశారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్‌, ఉదయ్‌‌సింహ ఇళ్ళలో తనిఖీలు ముగిశాయి. సెబాస్టియన్‌ కి నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు..సోమవారంలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories