ప్రమాణస్వీకారంలో తడబడ్డ ఇమ్రాన్‌ఖాన్...

ప్రమాణస్వీకారంలో తడబడ్డ ఇమ్రాన్‌ఖాన్...
x
Highlights

పాకిస్థాన్‌ ప్రధాన మంత్రిగా తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఇస్లామాబాద్‌లోని ప్రెసిడెంట్‌ హౌస్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ చేత...

పాకిస్థాన్‌ ప్రధాన మంత్రిగా తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఇస్లామాబాద్‌లోని ప్రెసిడెంట్‌ హౌస్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ చేత పాకిస్తాన్‌ ప్రెసిడెంట్‌ మమ్నూన్‌ హుసేన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఇండియా నుంచి మాజీ క్రికెటర్‌, పంజాబ్ మంత్రి సిద్ధూ ఒక్కరే హాజరయ్యారు.

జులై 25 జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో తెహ్రీక్ ఈ ఇన్సాఫ్‌ పార్టీ 272 స్థానాలకు 116 సీట్లలో విజయం సాధించింది. 21 సీట్లు తక్కువ రావడంతో మిత్రపక్షాలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్థాన్‌ ప్రైమ్‌ మినిస్టర్‌గా మాజీ క్రికెటర్, తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లామాబాద్‌లోని రాష్ట్రపతి భవన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ చేత ప్రెసిడెంట్‌ మమ్నూన్‌ హుసేన్ ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్‌ తడబడ్డారు. రోజే ప్యామత్‌ పదానికి బదులు రోజే క్యాదత్‌ అని పలికారు. పదాన్ని తప్పు పలికిన ఇమ్రాన్‌ ఖాన్‌ వెంటనే క్షమాపణ చెప్పారు. తర్వాత ప్రెసిడెంట్‌ మమ్నూన్‌ ఇమ్రాన్‌‌ చేత కరెక్ట్‌గా పలికించారు.

ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి పాకిస్థాన్‌‌‌లోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలు, త్రివిధ దళాల అధిపతులు క్రికెటర్లు హాజరయ్యారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. ప్రెసిడెంట్‌ హాలులో సిద్దూకు తొలి వరుసలోని సీటు కేటాయించి నవజోత్‌ సిద్ధూపై అభిమానాన్ని చాటుకున్నారు ఇమ్రాన్‌ఖాన్‌. దేశాన్ని దోచుకున్న రాజకీయ నేతలందర్ని చట్టం ముందు నిలబెడతానంటూ ప్రమాణస్వీకారం తర్వాత ఇమ్రాన్‌ఖాన్‌ ఉద్వేగంగా మాట్లాడారు. దేశాన్ని ఎవరు దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories