త‌ల‌నొప్పి విప‌రీతంగా వస్తుందా!

త‌ల‌నొప్పి విప‌రీతంగా వస్తుందా!
x
Highlights

తీవ్ర‌మైన సైన‌స్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సైన‌స్ ల‌క్ష‌ణాల‌లో భాగంగా ముక్కు దిబ్బ‌డ‌, త‌ల‌నొప్పి, ద‌గ్గు లాంటివి ఉంటాయి. విటమిన్ ఏ పుష్క‌లంగా ఉండే...

తీవ్ర‌మైన సైన‌స్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సైన‌స్ ల‌క్ష‌ణాల‌లో భాగంగా ముక్కు దిబ్బ‌డ‌, త‌ల‌నొప్పి, ద‌గ్గు లాంటివి ఉంటాయి. విటమిన్ ఏ పుష్క‌లంగా ఉండే ఆహార‌ప‌దార్థాల‌ను తిన‌డం ద్వారా రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకోవ‌చ్చు. సైన‌స్‌ను క‌లిగించే క్రిముల‌నుంచి శ‌రీరాన్ని కాపాడుకోవ‌చ్చు. కేవ‌లం యాంటిబ‌యాటిక్స్ ను మింగ‌డం వ‌ల్ల అంత‌గా ప్రయోజ‌నం ఉండ‌దు. సైన‌స్‌ను ఎదుర్కొన‌గ‌లిగే ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలి.

* పైనాపిల్ లో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముక్కు లో ఉన్న మ్యూక‌స్ మెంబ్రేన్‌ను ర‌క్షిస్తుంది. పైనాపిల్‌లో కొన్ని రకాల ఎంజైమ్‌ల వ‌ల్ల సైనస్ నుంచి సాంత్వన ల‌భిస్తుంది.

* సైన‌స్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్ట‌యితే ... పుచ్చ‌కాయ తిన‌డం మేలు. దీంట్లో అవ‌స‌రమైన మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇందులోని మెగ్నీషియం త‌ల‌నొప్పిని నివారించే గుణ‌ముంది.

* అల్లంలో యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి. దీంతోపాటు యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ ల‌క్ష‌ణాల వ‌ల్ల నొప్పి త‌గ్గించ‌గ‌ల‌గుతుంది. అదేవిధంగా సులువుగా జీర్ణ‌మ‌య్యేలా అల్లం దోహ‌ద‌ప‌డుతుంది.

* ముల్లంగి ఇన్‌ప్ల‌మేష‌న్‌ను త‌గ్గించి మ్యూక‌స్ ఉత్ప‌త్తిని పెంచుతుంది. దీనికి మంచి యాంటి బ‌యాటిక్ ల‌క్షనాలు ఉన్నాయి. అవి త‌ల‌నొప్పిని ఇట్టే మాయం చేసేయ‌గ‌ల‌దు.

*వేడి వేడి సూప్‌ చికెన్ లేదా వెజిటెబుల్ సూప్ సైనస్ త‌ల‌నొప్పి నివార‌ణ‌కు బాగా ప‌నిచేస్తుంది. వేడి వేడి సూప్ తాగ‌డం వ‌ల్ల మ్యూక‌స్ సుల‌భంగా క‌దిలి సైన‌స్‌ను క్లియ‌ర్ చేస్తుంది.

*వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది సైన‌స్‌తో బాధ‌ప‌డేవారికి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. అందుకే కాస్త వెల్లుల్లి తింటే త‌ల‌నొప్పి, ముక్కుదిబ్బ‌డ మ‌టుమాయం అవుతుంది.

*ఉల్లి ఉల్లికి ఘాటైన వాస‌న ఉంటుంది. దీంట్లో యాంటీ హిస్ట‌మైన్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అవి సైన‌స్ కంజెష‌న్‌ను త‌గ్గించ‌గ‌ల‌వు.

* నిమ్మకాయ‌లు, ద్రాక్షల్లో విట‌మిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి సైన‌స్ ను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories