తన పెళ్లి వార్తలపై స్పందించిన శ్రియ

Submitted by arun on Wed, 02/07/2018 - 12:23
Shriya Saran

హీరోయిన్‌ శ్రియ శరన్ పెళ్లి మార్చిలో జరగనున్నట్టుగా వార్తలు వినిపించాయి. కొద్ది రోజులుగా ఓ రష్యాన్‌ యువకుడితో సన్నిహితంగా ఉంటున్న శ్రియ అతడినే పెళ్లాడనుందన్న వార్త మీడియా సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అంతేకాదు రాజస్థాన్‌లో వీరి వివాహ వేడుక జరగనుందని, ఇప్పటికే ఈ జంట షాపింగ్‌ కూడా మొదలెసినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే అవన్ని రూమర్ప్ అంటూ కొట్టి పారేసింది శ్రియ. తన స్నేహితురాలి వివాహం ఉండటంతో నగలు ఆర్డర్ ఇచ్చానని, బట్టలు కొనుగోలు చేశానని చెప్పిన శ్రియ, తన వివాహం ఇప్పట్లో కాదని చెప్పింది. వచ్చే నెల రోజుల్లో రెండు ముఖ్యమైన పెళ్లిళ్లకు తాను వెళ్లల్సి వుందని, తన షాపింగ్ కారణంగానే రూమర్స్ వచ్చాయని తెలిపింది.

English Title
I’m not getting married, says Shriya Saran

MORE FROM AUTHOR

RELATED ARTICLES