కుటుంబాలను కూల్చేస్తున్న అక్రమసంబంధాలు

Submitted by arun on Mon, 07/30/2018 - 18:19
illegal affairs

నైతిక విలువలను మరచి బంధాలను బలిపెడుతూ సాగిస్తున్న వివాహేతర సంబంధాలు విషాదాలుగా మారుతున్నాయి. శారీరక సౌఖ్యాల కోసం విజ్ఞత మరిచి మానత్వాన్ని తాకట్టు పెడుతున్న ఉదంతాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో ప్రియుడి హత్య తీవ్ర కలకలం రేపుతోంది.

కాళ్లు, చేతులకు గొలుసులు గొలుసులకు తాళాలు ఇలా ప్రియుడిని దారుణంగా హతమార్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. కొనకొనమిట్ల మండలం చౌటపల్లె గ్రామానికి చెందిన షబ్బీర్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా విధులకు దూరంగా ఉన్న షబ్బీర్‌ స్థానికంగా ఉన్న ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటికే రెండు వివాహాలు చేసుకున్న షబ్బీర్‌ వివాహేతర సంబంధం ఉన్న యువతితో కలిసి గ్రామంలో ఓ కోళ్ల ఫారం నడుపుతున్నారు. వ్యాపార లావాదేవీల్లో ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే అర్ధరాత్రి సమయంలో తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో ప్రియుడు షబ్బీర్‌ కాళ్లు చేతులు గొలుసులతో ఇలా కట్టేసి పెట్రోల్‌ పోసి దారుణంగా హ‍తమార్చింది. 

హత్య చేసిన అనంతరం షబ్బీర్ ప్రియురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. తనను తరచూ వేధిస్తూ ఉండటం వల్లే హత్య చేశానంటూ పోలీసులతో చెప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరును చూసి అవాక్కయ్యారు. పోకిరి సినిమా తరహాలో కాళ్లు, చేతులు కట్టేసి మరీ హత్య చేయడం పోలీసులను సైతం కాసేపు ఆలోచనలో పడేసింది. వివాహేతర సబంధాలతో మానవ సంబంధాల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్న ఇలాంటి ఘటనలపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English Title
illegal affairs killing families

MORE FROM AUTHOR

RELATED ARTICLES