‘ఇది నా లవ్‌ స్టోరి’ మూవీ రివ్యూ

‘ఇది నా లవ్‌ స్టోరి’ మూవీ రివ్యూ
x
Highlights

నిర్మాణ సంస్థ‌: రామ్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ తారాగ‌ణం: తరుణ్‌, ఓవియా, ఖయ్యుమ్‌, చిట్టిబాబు, జగదీష్‌, అనిల్‌ తదితరులు సంగీతం: శ‌్రీనాథ్ విజ‌య్‌, ఎడిటర్‌:...

నిర్మాణ సంస్థ‌: రామ్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌
తారాగ‌ణం: తరుణ్‌, ఓవియా, ఖయ్యుమ్‌, చిట్టిబాబు, జగదీష్‌, అనిల్‌ తదితరులు
సంగీతం: శ‌్రీనాథ్ విజ‌య్‌,
ఎడిటర్‌: శంకర్‌
సినిమాటోగ్రఫీ: క్రిస్టోపర్‌ జోసెఫ్‌
నిర్మాత: ఎస్‌.వి.ప్రకాష్‌
దర్శకత్వం: రమేష్‌ - గోపి

బాల‌న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్న మాస్ట‌ర్ త‌రుణ్ హీరోగా మారిన త‌ర్వాత నువ్వేకావాలి, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ప్రియ‌మైననీకు వంటి సినిమాల‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుక‌న్నారు. అయితే క్ర‌మంగా మంచి సబ్జెక్ట్స్‌ను ఎంచుకోక‌పోవ‌డం ఇత‌ర కార‌ణాల‌తో వ‌రుస ప‌రాజ‌యాల‌ను ఎదుర్కొన్నాడు. ఒక‌ప్పుడు ల‌వ‌ర్‌బోయ్ ఇమేజ్‌ను సంపాదించుకున్న త‌రుణ్‌.. చాలా కాలం వ‌ర‌కు సినిమా రంగానికి దూర‌మ‌య్యాడు. సినిమాల్లో అడుగ‌పెట్టిన వారికి ...దాని నుండి దూరంగా జ‌ర‌గ‌డం అనేది సాధ్య‌మ‌య్యే విష‌యం కాదు. అందుకే చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లో రాణించాల‌నే త‌ప‌న‌తో మంచి ల‌వ్‌స్టోరీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. క‌న్న‌డంలో విజ‌యవంత‌మైన ఓ సినిమాను తెలుగులో ‘ఇది నా లవ్‌స్టోరీ’ అనే పేరుతో తెర‌కెక్కించారు. మ‌రి ఈ ప్రేమ‌క‌థ‌తో అయినా త‌రుణ్ స‌క్సెస్‌ను అందుకున్నాడా? లేదా? అని తెలుసుకోవాలంటే క‌థలోకి వెళ‌దాం..

కథ : అభిరామ్‌ (తరుణ్‌) యాడ్‌ ఫిలిం డైరెక్టర్‌. తల్లిదండ్రులు లేని అభిరామ్‌కు చెల్లెలంటే ప్రాణం. అందుకే చెల్లి ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి ఫిక్స్‌ చేస్తాడు. అభిరామ్ చెల్లి.. తనకు కాబోయే మరదలిని తన అన్న పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వాళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తుంది. చెల్లెలి మాట కాదనలేక అభిరామ్‌.. డాక్టర్‌ శృతిని చూసేందుకు ఒప్పుకుంటాడు. వెళ్లేదారిలో ఓ అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తీరా తనే శృతి (ఓవియా) అని తెలిసి ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్‌ అవుతాడు. ఇంట్లో వాళ్లంతా గుడికి వెళ్లారని రావడానికి చాలా సమయం పడుతుందని శృతి చెప్పటంతో ఈ లోగా ఒకరి ఇష్టాఇష్టాలను ఇంకొకరు తెలుసుకోవచ్చిన గతం గురించి మాట్లాడుకోవటం మొదలపెడతారు. ఇద్దరు తమ తొలి ప్రేమకథలను పంచుకుంటారు. అదే సమయంలో శృతి కూడా అభిరామ్‌తో ప్రేమలో పడుతుంది. మరుసటి రోజు ఉదయం లేచేసరికి పోలీసులు అభిరామ్‌ను అరెస్ట్ చేస్తారు. శృతి కంప్లయిట్‌ ఇచ్చినందుకే తనని అరెస్ట్ చేశారని తెలిసి షాక్‌ అవుతాడు అభిరామ్‌. అసలు శృతి అలా ఎందుకు కంప్లయింట్‌ ఇచ్చింది..? ఆమె నిజంగా శృతినేనా..? చివరకు అభిరామ్‌కు తను ప్రేమించిన అమ్మాయి దక్కిందా..? అన్నదే మిగతా కథ.

తరుణ్ నటన ఎప్పటిలానే అలరించింది. లవర్ బోయ్ ఇమేజ్ ను తిరిగ్ తెచ్చుకునే క్రమంలో తరుణ్ ఓ మంచి ప్రయత్నమే చేశాడు. ఇక ఓవియా కూడా ఆకట్టుకుంది. కోలీవుడ్ బిగ్ బాస్ తో ఆమె అందరికి సుపరిచితురాలైంది. తరుణ్, ఓవియాల జంట బాగుంది. సినిమా మొత్తం ఈ ఇద్దరి పాత్రల మీదే నడుస్తుంది. లీడ్ పెయిర్ బాగానే అలరించారు. జోసెఫ్ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. శ్రీనాథ్ విజయ్ మ్యూజిక్ పర్వాలేదు. రమేష్ గోపి డైరక్షన్ పర్వాలేదు. అయితే కథ సింపుల్ గా ఉన్నా కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.


ఇది నా లవ్ స్టోరీ.. రొటీన్ కథ.. కథనం కూడా నెమ్మదిగా సాగుతుంది. సినిమా మొత్తం లీడ్ కాస్టింగ్ అయిన హీరో.. హీరోయిన్ మీదే నడుస్తుంది. సినిమా అంతా తరుణ్ బాగానే చేశాడు. అయితే కథనంలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటే బాగుండేది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకోలేదు. లవ్ స్టోరీ అంటే లవ్ అండ్ ఎమోషన్స్ మీద సీన్స్ బాగా రాసుకోవాలి. అయితే సినిమాలో డైలాగ్స్ కాస్త బాగా రాసుకున్నారు. మొదటి భాగం ఇంట్రెస్టింగ్ గా సాగగా సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్టు అవుతుంది. తరుణ్ నటనకు మంచి మార్కులే పడతాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చిన తరుణ్ ఇది నా లవ్ స్టోరీ అంచనాలను అందుకోలేదు. కథ, కథనంలో సినిమా టైంపాస్ గా సాగుతుంది కాని అంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టస్ ఏమి ఉండవు. ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయని అనిపిస్తుంది. అయితే హీరో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ చెప్పేప్పుడు వేరే పాత్రలు కాకుండా లీడ్ హీరో, హీరోయిన్ నే ఊహించుకోవడం కాస్త బాగుంటుంది.

ప్లస్ పాయింట్స్ :
ప్రీ క్లైమాక్స్‌లో తరుణ్‌ నటన
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :
కథా కథనం
డైలాగ్స్‌
సంగీతం

Show Full Article
Print Article
Next Story
More Stories