ఐఏఎస్ ఆమ్రపాలికి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక పదవి..

Submitted by arun on Fri, 09/21/2018 - 15:57
Amrapali Ias

ఐఏఎస్ ఆమ్రపాలికి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఆమ్రపాలి నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఐటీ సంబంధిత అంశాలను ఆమ్రపాలి పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం ఆమ్రపాలి జీహెచ్ఎంసి అదనపు కమిషనర్ గా ఉన్నారు. 2010 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమ్రపాలి.. గతంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.
 

English Title
ias amrapali elected as joint ceo of telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES