సీఎం రాజీనామా చేస్తే.. నేనూ చేసేస్తా!!

Submitted by arun on Wed, 03/21/2018 - 16:58
somu

బీజేపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారనే ప్రచారం అవాస్తవం అని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలిసి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చినందున బీజేపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారనే ప్రచారం పూర్తి అవాస్తవమన్నారు. టీడీపీ, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చామన్న వీర్రాజు సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే అప్పుడు తాను కూడా రాజీనామా చేస్తానని వీర్రాజు స్పష్టం చేశారు. అంతగా అనుకుంటే ఇప్పుడే అందరూ కలిసి రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. రాష్ట్రంపై యుద్ధం చేస్తామని ఏ బీజేపీ లీడర్  మాట్లాడలేదని అదంతా తప్పుడు ప్రచారమే అని కొట్టిపారేశారు. 

English Title
iam ready resign said mlc somu veerraju

MORE FROM AUTHOR

RELATED ARTICLES