నాన్నకు ప్రేమతో.....

Submitted by arun on Mon, 04/16/2018 - 16:31
 Saina Nehwal

కంటే కూతుర్నే కనాలి ...అన్నమాట...భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ తండ్రి హర్ వీర్ సింగ్ కు అతికినట్లు సరిపోతుంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదిగా ముగిసిన 2018 కామన్వెల్త్ గేమ్స్ లో టీమ్, వ్యక్తిగత విభాగాలలో స్వర్ణపతకాలు సాధించిన తన బంగారు కొండ సైనా ను చూసి ఆమెతండ్రి హర్ వీర్ సింగ్ మురిసిపోతున్నారు. పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు.

సైనా నెహ్వాల్ భారత మహిళా బ్యాడ్మింటన్ ప్రతిష్టను ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకువెళ్లిన తొలి ప్లేయర్. సైనా నెహ్వాల్ ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్లో చైనావాల్ ను బద్దలుకొట్టి డ్రాగన్ ప్లేయర్ల ఆధిపత్యానికి గండికొట్టిన భారత తొలిమహిళ. సైనా నెహ్వాల్ కామన్వెల్త్ గేమ్స్ లో రెండుసార్లు వ్యక్తిగత విభాగంలో బంగారు పతకాలు సాధించిన భారత ఏకైక ప్లేయర్. సైనా నెహ్వాల్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్ కు పతకం అందించిన తొలి మహిళ. సైనా ఘనతల ఇలా చెప్పుకొంటూ పోతే అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అన్నట్లుగా సాగిపోతూనే ఉంటుంది.

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన 2018 కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభానికి రెండురోజుల ముందు వరకూ సైనా తీవ్రఒత్తిడిలో నిదురలేని రాత్రులు గడిపింది. తనతోపాటు కామన్వెల్త్ గేమ్స్ కు వచ్చిన తండ్రి హర్ వీర్ సింగ్ ను గేమ్స్ విలేజ్ లోకి అనుమతించకపోడం వ్యక్తిగత కోచ్ హోదాలో ఎక్రెడిటేషన్ ఇవ్వకపోడంతో తీవ్రమనస్తాపం చెందింది.

తండ్రి కనీసం భోజనం చేశారో లేదో తెలియక తీవ్రఆందోళనకు గురయ్యింది. ఓ దశలో గేమ్స్ నుంచి వైదొలగుతానంటూ ట్విట్టర్ ద్వారా బెదిరించి విమర్శలు కొని తెచ్చుకొంది. అయితే చివరకు తండ్రి హర్ వీర్ సింగ్ ను గేమ్స్ విలేజ్ లోకి అనుమతించడంతో ఊపిరి పీల్చుకొంది. విమర్శలను పక్కన పెట్టి ఆటపై పూర్తిగా దృష్టి కేంద్రకీరించింది. పదిరోజులపాటు రోజుకో మ్యాచ్ ఆడుతూ అలుపెరుగని పోరాటం చేసింది. ముందుగా మిక్సిడ్ టీమ్ విభాగంలో భారత్ బంగారు పతకం గెలుచుకోడంలో తనవంతు పాత్ర నిర్వర్తించింది. ఆ తర్వాత జరిగిన మహిళల వ్యక్తిగత స్వర్ణం కోసం జరిగిన పోటీలో తనకంటే అత్యంత బలమైన ప్లేయర్ పీవీ సింధును వరుస గేమ్ ల్లో కంగు తినిపించి రెండోసారి బంగారు పతకం అందుకొని చరిత్ర సృష్టించింది.

కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే రెండు వేర్వేరు గేమ్స్ లో బంగారు పతకాలు సాధించిన భారత తొలి బ్యాడ్మింటన్ ప్లేయర్ గా సైనా చరిత్ర సృష్టించింది. 2010 న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారిగా మహిళల
సింగిల్స్ బంగారు పతకం సాధించిన సైనా..2018 గోల్డ్ కోస్ట్ గేమ్స లో సైతం స్వర్ణ విజేతగా నిలిచింది. తాను సాధించిన ఈ పతకాన్ని తనతండ్రి హర్ వీర్ సింగ్ కు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించింది. తనకు కన్నతండ్రి, దేశం తర్వాతే ఎవరైనా అంటూ సైనా ప్రకటించింది. తన వయసైపోయింది పనైపోయిందంటూ విమర్శలు చేసేవారి నోటికి సైనా తనదైన శైలిలో తాళం వేసింది. భారత మహిళా బ్యాడ్మింటన్ అంటే...సైనా తర్వాతే ఎవరైనా అని లేటువయసులో తన ఘాటైన విజయాలతో చెప్పకనే చెప్పింది.

English Title
I never lost hope, just kept fighting, says Saina Nehwal on CWG gold

MORE FROM AUTHOR

RELATED ARTICLES