తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. బాలికలదే పై చేయి

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల..  బాలికలదే పై చేయి
x
Highlights

ట్టకేలకు తెలంగాణ ఇంటర్ పరీక్ష పలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 76 శాతంతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 29 శాతంతో...

ట్టకేలకు తెలంగాణ ఇంటర్ పరీక్ష పలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 76 శాతంతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 29 శాతంతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ర్ట ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్ధన్‌ రెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2,70,575 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 59.8 శాతం ఉత్తీర్ణత పొందారు. ద్వితీయ సంవత్సరంలో 2,71,949 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 65 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో 76 శాతంతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 29 శాతంతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. గత ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మే 14 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రేపు విడుదల చేయనున్నారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25ను ఆఖరు తేదీగా నిర్ణయించారు.






Show Full Article
Print Article
Next Story
More Stories